ఇవాల్టి నుంచి మీ జిల్లా మారిపోయింది.. ఏపీలో కొత్త జిల్లాలు ఆవిర్భావం..!

ఏపీలో సీఎం జగన్ కొత్త శకానికి నాంది పలికారు. కొత్త జిల్లాలను వర్చువల్ గా ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయన్నారు.

ఈరోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రాగా ఆంధ్రప్రదేశ్ మారిందని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. చివరగా 1970 మార్చిలో ప్రకాశం, 1979 జూన్ లో విజయనగరం జిల్లా ఏర్పడిందని జగన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని ఉద్యోగులందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 

ఏపీలో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు ఇవే..

1.పార్వతీపురం మన్యం

2.అల్లూరి సీతారామరాజు

3.అనకాపల్లి

4.కాకినాడ

5.కొనసీమ

6.ఏలూరు

7.ఎన్టీఆర్

8.పల్నాడు

9.బాపట్ల

10.నంద్యాల

11.శ్రీసత్యసాయి

12.తిరుపతి

13.అన్నమయ్య  

 

Leave a Comment