MA ఇంగ్లీష్ చదివి.. టీ స్టాల్ పెట్టుకుంది.. నిరుద్యోగులకు స్ఫూర్తిగా నిలిచింది..!

ఈరోజుల్లో చదువుకు తగ్గట్టు ఉద్యోగాల రావట్లేదు..పీజీలు చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నించినా సరైన ఉద్యోగం రావడం లేదు. ఉద్యోగ వేటలో పడి అలసిపోయిన యువత.. వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. చిన్న ఉద్యోగాలు, తక్కువ జీతాలు, రాజీ పడుతూ వచ్చిన ఉద్యోగాల కంటే నచ్చిన పనిచేయడం బెటర్ అని భావిస్తున్నారు.. అలాంటి కథే ఈ ‘ఎంఏ ఇంగ్లీష్ చాయ్ వాలీ’ అమ్మాయిది.. 

కోల్ కతాకు చెందిన తుక్తుకీ దాస్ ఇంగ్లీష్ లో పీజీ చేసింది. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు ఉద్యోగం రాలేదు. దీంతో సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. నార్త్ 24 పరగణాస్ లోని హబ్రా స్టేషన్ లో ‘MA ఇంగ్లీష్ చాయ్ వాలీ’ పేరుతో ఓ టీ స్టాల్ ఓపెన్ చేసింది.. ఉద్యోగాలు రాక ఆత్మహత్యాయత్నాలు చేస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇప్పుడు ఈమె స్టోరీ ఒకసారి తెలుసుకుందాం.. 

తుక్తుకీ దాస్ ది నిరుపేద కుటుంబం.. ఆమె తండ్రి ఓ వ్యాన్ డ్రైవర్. ఆమె తల్లికి చిన్న కిరాణం దుకాణం ఉంది. ఆమె ఉపాధ్యాయురాలు కావాలనేది తుక్తుకీ తల్లిదండ్రుల కల.. దీంతో తుక్తుకీని ఉన్నత చదువులు చదివించారు. తుక్తుకీ ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ఎంఏ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ ఆమె ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా ఆమెకు ఉద్యోగం రాలేదు.. దీంతో తుక్తుకీ టీ స్టాల్ పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే టీ స్టాల్ పెట్టేందుకు ఆమె తల్లిదండ్రులు మొదట అంగీకరించలేదు. తర్వాత వారిని నచ్చజెప్పడంతో వారు ఒప్పుకున్నారు. అంతే వారి ఆశీర్వాదంతో నార్త్ 24 పరగణాస్ లోని హబ్రా రైల్వే స్టేషన్ లో టీ స్టాల్ ఓపెన్ చేసింది. దానికి ‘MA ఇంగ్లీష్ చాయ్ వాలీ’ అని బోర్డ్ పెట్టింది. 

 ‘MBA చాయ్ వాలా’ స్ఫూర్తితోనే..

తుక్తుకీ ‘MBA చాయ్ వాలా’ అని ఇంటర్నెట్ లో ఒకరి సక్సెస్ స్టోరీ చదివింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ‘MA ఇంగ్లీష్ చాయ్ వాలీ’ పేరుతో టీ స్టాల్ తెరిచింది. మొదట్లో స్టేషన్ లో షాప్ పెట్టుకోవడానికి స్థలం దొరకడం చాలా కష్టమైంది. తర్వాత ఎలాగోలా స్థలం సంపాదించుకోగలిగింది. ఆమె టీ స్టాల్ లో రుచికరమైన వివిధ రకాల టీలతో పాటు స్నాక్స్ కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాదు తుక్తుకీకి చాయ్ దుకాణంతో పాటు సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆమె వీడియోలు వైరల్ అవుతుంటాయి. దీంతో ఆమెను కలవడానికి చాలా మంది వస్తుంటారు.. ఎంత మంచి అర్హతులున్నప్పటికీ ఉద్యోగం రాక నిరుత్సాహంతో ఉన్న ఎంతో మంది యువతకు ఈమె స్ఫూర్తిగా నిలుస్తుంది.. ఉద్యోగాలు సాధించలేక డిప్రెషన్ కి గురవుతున్న వారికి ఇలాంటి స్టోరీలు చెప్పి వారిలో ఉత్సాహాన్ని నింపండి ఫ్రెండ్స్.. ఎందుకంటే ఏ చెత్తది కాదు.. చిన్నది కాదు.. 

Leave a Comment