గ్రామ, వార్డు మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. సీఐ వరకు పదోన్నతి..!

గ్రామ, వార్డు మహిళా పోలీసులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. త్వరలో వారిని క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీని కోసం ముసాయిదా బిల్లను రూపొందించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో చేస్తున్న మహిళా పోలీసులకు కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికీ జీవో జారీ చేసింది. వారి సర్వీసులను ప్రభుత్వం త్వరలో క్రమబద్ధీకరించనుంది. 

ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధిలు నిర్వహిస్తున్నారు. వారికి కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వారి హాజరు, సెలవులు మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీ లేదా పంచాయతీ పరిధిోనే ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అయితే సాధారణ పోలీసుల ఎంపిక ప్రక్రియ, మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంది. దీంతో సాంకేతిక సమస్యలు రాకుండా మహిళా పోలీసులను క్రమబద్ధీకరించాలి. దీంతో మహిళా పోలీసులను ప్రత్యక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది. 

పదోన్నతి ఎలా అంటే..

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల కోసం ‘హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐ’ వరకు పదోన్నతులు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో కొన్ని వార్డులకు, గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక మహిళ హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. పోలీస్ సర్కిల్ స్థయాలో మహిళా ఏఎస్ఐ,పోలీస్ సబ్ – డివిజన్ స్థాయిలో మహిళా ఎస్ఐ, పోలీస్ జిల్లా స్థాయిలో మహిళా సీఐ ఉంటారు. అయితే ఈ పదోన్నతుల అంశంపై మరింత సమీక్షిస్తారు. ఆ తర్వాత హోం శాఖ తుది ముసాయిదాను ఖరారు చేయనుంది. తర్వాత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 

 

 

Leave a Comment