కరోనాతో ఉద్యోగాలు కోల్పోయారు.. టీ స్టాల్ పెట్టి లక్షలు సంపాదిస్తున్న యువ ఇంజినీర్లు..!

కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా ఎంతో మంది మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం చేస్తూ ఉద్యోగాలు కోల్పోతున్న వారు కొత్త పంథాలో పయనిస్తూ తమకంటూ ఓ ఉపాధిని సృష్టించుకున్నారు. ఈరోజుల్లో టీ చేయడం అనేది కష్టమైన పని ఏమీ కాదు. నామమాత్రపు పెట్టబడి.. కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా టీ స్టాల్ పెట్టి సొంతంగా సంపాదించుకోవచ్చు. అయితే టీ స్టాల్ తో లక్షలు సంపాదించవచ్చని కేరళకు చెందిన ముగ్గురు ఇంజినీర్లు నిరూపించారు. 

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు ఆనంద్ అజయ్, మహ్మద్ షఫీ, మహ్మద్ షానవాస్ కోరాన సంక్షోభంలో తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో మళ్లీ ఉద్యోగం వైపు వెళ్లకుండా ఉపాధి మార్గాన్ని అన్వేషించారు. టీ స్టాల్ అయితే బాగుంటుందని అనుకున్నారు. ముగ్గురు కలిసి 1.5 లక్షల రూపాయల పెట్టుబడితో కొల్లాంలో ‘BTech Chai’ అనే పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశారు. చాయ్ ప్రియులకు ఆకట్టుకునేలా రకరకాల టీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో టీ రూ.5 నుంచి రూ.45 వరకు పెట్టారు. 

సాధారణంగా టీ స్టాల్స్ లో జింజర్ టీ, లెమన్ టీ, ఆల్మండ్ టీ, హనీ టీ మరియు బ్లాక్ టీ లభిస్తాయి. కానీ బీటెక్ చాయ్ స్టాల్ లో దాదాపు 50 రకాల చాయ్ లను అందిస్తున్నారు. టీ ఎంతో రుచికరంగా ఉండటంతోె పెట్టిన కొద్ది రోజులకే ఫేమస్ అయ్యింది. పైనాపిల్ చాయ్, స్ట్రాబెర్రీ చాయ్, చాక్లెట్ చాయ్, ఆల్మండ్ పిస్తా చాయ్, వెనీలా చాయ్, డైరీ మిల్క్ చాయ్, బటర్ చాయ్, పుదీనా చాయ్, గింజా చాయ్, సాఫ్రాన్ చాయ్ ఇలా ఎన్నో రకాల టీలు బీటెక్ చాయ్ స్టాల్ లో లభిస్తాయి. 

బీటెక్ చాయ్ స్టాల్ లో గింజా చాయ్ చాలా చాలా స్పెషల్.. ఈ టీని 10 రకాల మసాలా దినుసులతో తయారు చేస్తారు. ఈ టీ స్టాల్ తో ఈ యువ ఇంజినీర్లు మంచి లాభాలు పొందుతున్నారు. త్వరలో కస్టమర్లకు 101 వెరైటీ చాయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జీవితంలో ఎదగాలంటే.. డబ్బు సంపాదించాలంటే చిన్న ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే చాలా అని నిరూపించారు ఈ కేరళ యువ ఇంజినీర్లు..  

Leave a Comment