మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఏం జరిగిందో వీడియో చూడండి..!

క్రికెట్ అంటేనే ఓ క్రేజ్.. మ్యాచ్ ఉత్కంఠతతో జరుగుతున్న సమయంలో వర్షం పడటం సహజమే.. కానీ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం వస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. కానీ అదే జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా భూకంపం వచ్చింది. కెమెరాలు కొద్దిసేపు కదిలిపోయాయి. ఇంత జరుగుతున్న ఆటగాళ్లు మాత్రం ఏం తెలియలేదు. వారు ఆటలో లీనమయ్యారు.. 

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో ఆరో ఓవర్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా భూమి కంపించింది. ప్రత్యక్ష ప్రసారం కోసం అమర్చిన లైవ్ కెమేరాలు అటూఇటూ కదిలిపోయాయి. కెమేరాలో గ్రౌండ్ స్క్రీన్ కదిలినట్లు స్పష్టంగా కనిపించింది. 

అయితే గ్రౌండ్ లో ఆటగాళ్లు మాత్రం ఆటలో లీనమైపోయారు. దీంతో వారికి ఏం తెలియలేదు. కామెంటేటర్లు భూకంపం అని ఫన్నీగా మాట్లాడినా.. అంతలోనే కోలుకుని కంగారుపడ్డారు. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. కాసేపటికి ఐర్లాండ్ క్రికెట్ కూడా ట్రినిడాడ్ సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ట్వీట్ చేసింది. మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో భూకంపం రావడం ఇదే తొలిసారి.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.   

Leave a Comment