పెళ్లెప్పుడవుతుందిరా బాబూ.. అక్కడ అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు..

‘శ్రీరస్తు.. శుభమస్తు’ అనే పాట పాడుకుంటూ పెళ్లి పుస్తకానికి శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు తమిళనాడులోని బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెళ్లికాని ప్రసాదులు. మూడు పదుల వయసు దాటినా.. పెళ్లి పుస్తకం తెరవని పురుషుల సంఖ్య 40 వేలు దాడిపోయింది. వీరికి అమ్మాయిలు దొరకట్టేదు.. అందుకే తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ రంగంలోకి దిగింది. తమిళనాడులో పెళ్లికాని ప్రసాదులకు యూపీ, బిహార్ లో ఇదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను వెతికే పనిలో పడింది. దీనికి సంబంధించి ఓ తమిళ మ్యాగజైన్ లో ప్రకటన కూడా ఇచ్చారు ఆ సంఘం అధ్యక్షుడు నారాయణన్..

తమిళనాడులో బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిలో 10 మంది అబ్బాయిలకు కేవలం 6 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే మిగిలిన నలుగురికి పెళ్లి వయసు దాటిపోతోంది.. అందుకోసం ఢిల్లీ, లఖ్నో, పట్నాలో సమన్వయకర్తలను నియమించుకున్నారు. పెళ్లిళ్లు జరిపించేందుకు లఖ్నో, పట్నాలలో కొందరితో మాట్లాడుతున్నారు. 

రాష్ట్రంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రుల వైఖరి వల్లే వారికి పెళ్లిళ్లు కావడం లేదని విద్యావేత్త పరమేశ్వరన్ వెల్లడించారు. చాలా మంది గ్రాండ్ గా పెళ్లి జరగాలని కోరుకుంటున్నారని, అలా చేసేందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని, అది పెళ్లి కుమార్తె కుటుంబానికి భారంగా మారుతోందని చెప్పారు. ప్రస్తుతం పెళ్లికొడుకు తల్లిదండ్రుల వైఖరిలో మార్పురావాలన్నారు. వారు అహం పక్కన పెడితే తమిళనాడులో అమ్మాయిలు దొరుకుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

Leave a Comment