‘రెండు ఇండియాల నుంచి వచ్చాను’.. కమేడియన్ వ్యాఖ్యలపై దుమారం..!

బాలీవుడ్ నటుడు, ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ వీర్ దాస్ వివాదంలో చిక్కుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్ లో ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్’ వీడియో వివాదానికి కారణమైంది. అమెరికా దేశం వాషింగ్టన్ డీసీలోని జాన్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్స్ ఆర్ట్స్ లో వీర్ దాస్ మాట్లాడాడు. అక్కడ ‘నేను రెండు ఇండియాల నుంచి వచ్చాను’ అంటూ పేర్కొన్నాడు. భారత్ ప్రతిష్టను కించపరిచేలా, దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వీర్ దాస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది..

ఇండియాలో రెండు కోణాలు ఉన్నాయని వీర్ దాస్ చెప్పుకొచ్చాడు. ‘ఒక ఇండియాలో పగటిపూట స్త్రీలను పూజిస్తారు..మరో ఇండియాలో రాత్రి పూట అత్యాచారాలు చేస్తారు.. అలాంటి ఇండియా నుంచి నేను వచ్చాను’ అంటూ వీర్ దాస్ ప్రసంగించారు. అదే విధంగా తన ప్రసంగం మొత్తం సాగింది. సామూహిక అత్యాచారాలు, హాస్య నటులపై అణచివేతలు, కాలుష్యం, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లు, కోవిడ్-19 పోరాటం, రైతుల నిరసన, పెట్రోల్ ధరల గురించి వీర్ దాస్ ప్రస్తావించారు. 

వీర్ దాస్ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీర్ దాస్ దేశాన్ని కించపరిచారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధ ఆదిత్య ఝూ, ముంబాయి న్యాయవాది అశుతోష్ దుబే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబల్, శశిథరూర్ వీర్ దాస్ ను సమర్ధించారు. రెండు భారత్ లు ఉన్నాయని, కానీ ఆ విషయాన్ని ఓ భారతీయుడు ప్రపంచానికి చెప్పడం మనకు ఇష్టం ఉండదని సిబల్ ట్వీట్ చేశారు. 

ఈక్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ఈమేరకు ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. ‘నేను పోస్ట్ చేసిన వీడియోలోని వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా లేవు. భారతదేశం చాలా గొప్పది.. ఈ వీడియో విభిన్నమైన అంశాలపై రెండు వేర్వేరు భారతదేశాల ద్వంద్వత్తం గురించి సెటైరికల్ గా ఉంది. ఏ దేశమైనా చీకటి – వెలుగు, మంచి – చెడులను కలిగి ఉంటుంది. ఇవేమీ రహస్యం కాదు.. ఎడిట్ చేసిన వీడియోలు పెట్టి తప్పుదారి పట్టించవద్దని వీర్ దాస్ కోరారు. వీర్ దాస్ మాట్లాడిన వీడియో కింద ఉంది.. 

 

Leave a Comment