కేరళలో చదువుల పుత్రుడు.. కరోనా టైంలో 145 డిగ్రీలు..అన్నీ ప్రపంచ టాప్ వర్సిటీలే!

 విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం చేయడం. విద్య అనగా మానవునిలో దాగివున్న అంతర-జ్ఞానాన్ని వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర-జ్ఞానాన్ని ప్రసాదించింది. దానికి సానబెట్టి వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.

కరోనా వైరస్ మానవ జీవన విధానాన్నే మార్చేసింది. ఇక విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు తెస్తుంది . డిజిటల్ తరగతుల దిశగా సర్కార్ ఆలోచన సాగించేలా చేస్తుంది. చదువుల్లో తోపు అనుకునేవాళ్లు మహా అయితే ఎన్ని డిగ్రీలు పూర్తి చేయగలరు? జీవితాంతం రకరకాల కోర్సులు చదువుతూ పోయినా ఎక్కువలో ఎక్కువ యాభైకి మించి పట్టాలను పొందలేరు. కానీ షఫీ విక్రమన్ స్టైలే వేరు.కేరళకు చెందిన ఆయన ఇప్పుడు ‘చదువుల బాహుబలి’గా బిరుదు పొందాడు. 

ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 145 డిగ్రీలు సాధించారాయన. తిరువనంతపురంలో నివసించే షఫీ విక్రమన్ ఓ సిమెంట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన సాధించిన 145 డిగ్రీలు 16 దేశాలకు చెందిన వివిద వర్సిటీలు, సంస్థల నుంచి పొందినవి. ఇన్నేసి డిగ్రీలు సాధించినా ఏనాడూ కాలేజీ ముఖం కూడా చూడకుండా అన్నీ ఆన్ లైన్ కోర్సులే చేశారాయన. హార్వర్డ్, యేల్, కొలంబియా, ప్రిన్స్‌టన్, వార్టన్.. ఇలా రాసుకుంటూ పొతే షఫీ విక్రమన్ సర్టిఫికేట్లు పొందిన వాటిలో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు చాలానే ఉన్నాయి.

విక్రమన్ పట్టాలు పుచ్చుకున్నది మామూలు విద్యా సంస్థలు కాదుమరి. ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ లాంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి కోర్సులు పూర్తి చేశారీయన. కోర్సులు కూడా సాధారణమైనవేమీ కాదు. మెడికల్, ఫైనాన్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్స్, బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ, ఫుడ్ అండ్ సైకాలజీ.. ఇలా వేటికవే అత్యాధునిక కోర్సులే.. మార్కెటింగ్ కోర్సులు ఏవైనా నేర్చుకుందామని మొదలు పెట్టిన ప్రయత్నం ఇంతింతై అన్నట్లు నన్నిప్పుడు మెడికల్ ఎక్స్ పర్ట్ గా మార్చేసింది. 

చిన్నప్పుడు మెడిసిన్ చదవలేకపోయాననే దిగులు లేదిప్పుడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కరోనాకు సంబందించిన కోల్సులు చాలా పూర్తిచేశాను. వరల్డ్ టాప్ యూనివర్సిటీలు ఇలాంటి కోర్సులు ఆఫర్ చేస్తాయని నాక్కూడా ముందు తెలీదు. నేర్చుకుంటూ పోతుంటే అన్నీ అలా కుదిరేశాయి. ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు’అని చెబుతారు షఫీ విక్రమన్. 16 దేశాల నుంచి 145 డిగ్రీలతో సరిపెట్టుకోలేదాయన.. ప్రస్తుతం మరో 20 కోర్సులను ఆన్ లైన్ లోనే చదివేస్తున్నారు.

 

Leave a Comment