మార్కెట్ లోకి కొత్త రకం టీ.. శిలాజిత్ టీ‌.. ఎప్పుడైనా విన్నారా? 

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు.

4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షన్ను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే.

తేనీరు  ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు.

అందరూ టీ తాగేందుకు చాలా ఆసక్తి చూపుతారు. అయితే, టీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘టీ’లో అనేక రకాలు ఉన్నాయని, రకరకాల టీ లతో.. రకరకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా బ్లాక్, గ్రీన్, ఊలాంగ్, పు-ఎర్త్, వైట్ టీలు నిజమైన టీ లు అని, ఇవన్నీ టీ ఆకుల నుంచి తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ మీరెప్పుడైనా శిలాజిత్ టీ గురించి విన్నారా? ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగించే శిలాజిత్‌తో ఆ టీ చేస్తారు. మరి దాని వల్ల కలిగే లాభాలేంటి? ఏలా చేస్తారో ఇక్క డ తెలుసుకుందాం.

 పాలు, చక్కెర, టీ పొడి.. వీటితో చేసే టీ మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ టీల్లో చాలా వెరైటీలు వచ్చేశాయి. పాలతో సంబంధం లేకుండా గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు రకరకాల హెర్బల్ టీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో ఒకటి శిలాజిత్ టీ. 

షిలాజిత్ టీ మిగతా టీల కన్నా భిన్నమైనది.  హిమాలయాలపై తారు లాంటి పదార్థం ఒకటి లభిస్తుంది. అదే శిలాజిత్. దానితో టీ తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.  శరీరానికి బలం ఇవ్వడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి ని కూడా పెంచుతుంది.

ఆయుర్వేదంలో శొంఠి, అశ్వగంధ, జావిత్రికి ఉన్న ప్రాధాన్యతతే శిలాజిత్‌కు కూడా ఉంది.  ఇది .  మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. కంటి చూపును పెంచుతుంది.  ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నందునే.. శిలాజిత్ టీకి  డిమాండ్ పెరిగింది. 

శిలాజిత్ టీ బ్యాగులు ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి. ఒక్కో బ్యాగ్ ధర రూ.10 నుంచి రూ.20 దాకా ఉంటుంది. మంచి క్వాలిటీ ఉండే బ్యాగ్‌లు తీసుకొని.. అప్పుడప్పుడూ తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

Leave a Comment