అప్పటి నుంచి 180 ఏళ్లు జీవించనున్న మనుషులు…నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు..!

ఈ ప్రపంచములో ప్రతి జీవికి ఒక ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది.. అలాగే ఒక్కో ప్రాణి కి ఒక జీవిత కాలం ఉంటుంది. ఇంతకీ. మనిషి జీవితకాలం  సాధారణంగా 100 ఏళ్లు జీవించగలడని అంటారు. కాని మనిషి జీవితం కాలము  వందేళ్లు కాదట.. వంద కంటే ఎక్కువ అని పరిశోధనలు చెపుతున్నయి.ఈ కాలంలో మనుషుల సగటు ఆయుష్షు చాలా తగ్గిపోయింది. ఒకప్పటి ప్రజలు చాలా మంది 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించారు. కానీ నేడు మానవుని సగటు వయస్సు 60 నుంచి 65 సంవత్సరాలు మాత్రమే. 

అయితే మానవుల జీవిత కాలం పెంచేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక శాస్త్రవేత్త ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాడు. వచ్చే శతాబ్దం నుంచి అంటే 2100 సంవత్సరం నుంచి మానవులు 180 సంవత్సరాల వరకు జీవిస్తారని చెపుతున్నారు. ఈయినా తో ఉండే  మిగతా శాస్త్రవేత్తలు కూడా ఈ శతాబ్దం చివరి ప్రజలు 130 సంవత్సరాల వయస్సు బతుకుతారని అంటున్నారు.100ఏళ్లపైనా జీవించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు పరిశోధకులు.

పండు ముసలి వారికి కూడా బతకాలనే ఉంటుంది. ఎందుకంటే… జీవితం ఒక్కటే. ఈ భూమి వయసుతో పోల్చితే మన జీవిత కాలం చాలా చిన్నది.ప్రస్తుతం సమాజంలో మనిషి  70 నుంచి 80 సంవత్సరాలు బతకడం  గగనంగా ఉంది.ఇలాంటి  సమయములో  చాలా మంది వారి కోరికలు తీరకుండానే తనువు చాలిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి 180 సంవత్సరాల వయస్సు వరకు జీవించినట్లయితే అతని నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి అని ఒక అంచన.

కెనడాలోని  ప్రొఫెసర్ లియో బెల్జిల్ 2100 సంవత్సరం నాటికి జీవించి ఉన్న అతి పెద్ద వ్యక్తి రికార్డును బద్దలు కొట్టగలరని చెప్పారు. ఇప్పుడు ఎక్కువ కాలం జీవించిన రికార్డు ఫ్రెంచ్ మహిళ జీన్ కాల్మెంట్ పేరిట ఉంది. ఆమె 1997లో 122 ఏళ్ల వయసులో మరణించింది.లియో బెల్జిల్ మానవ జీవితానికి గరిష్ట పరిమితి లేదని చెబుతున్నాడు. అయితే వ్యక్తి వయస్సు పెరిగితే వైద్య సేవల అవసరం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాడు. 

మానవులు వృద్ధాప్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వివిధ రకాల చికిత్సలకు గురవుతారు. అంతేకాకుండా పెన్షన్లు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్దయ్యాక ఏ పని చేయలేడు తద్వారా అతనికి జీవనోపాధి కష్టంగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించినట్లయితే శరీరంలోని అనేక భాగాలు పనిచేయడం మానేస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి మోకాలు, తుంటి, కార్నియా, గుండె కవాటాలు మార్చవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది.

 

Leave a Comment