ఒమిక్రాన్ భయం వెంటాడుతోందా.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా..!

మనం రోజూ తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు జాత చేస్తే , దానికదే  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా  ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెపుతున్నారు. రోగ నిరోధక శక్తి  మెరుగ్గా ఉంటే ఎన్నో  వైరస్‌లు, వ్యాధులను కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది అని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.ప్రపంచం మొత్తం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశములో కూడా కరోనా ప్రభావము ఎక్కువ అవుతుంది. ఈ మహమ్మరికి  తోడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసులూ ఎక్కువగా ఉన్నాయి. 

ఈ సమయములో ప్రజలందరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మరోవైపు ప్రభుత్వాలు పాక్షికంగా లాక్‌డౌన్ కూడా విధించాయి. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలి. మాస్క్‌ కచ్చితంగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. వీటికి తోడు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం రోజువారీ డైట్‌లో కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు ఉండాలి అవి బాగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మానవశరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే గుణం టమాటకే ఉంది. ఇది శరీరంలో విషపదార్థాలను తొలిగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి టమాట ఎంతో మేలుచేస్తుంది. టమాటతో బరువు తగ్గడంతో పాటు స్థూలకాయం కూడా తగ్గుతుంది. నిత్య జీవితంలో ఎక్కువ శాతం ప్రజలు టమాటను వినియోగిస్తారు. కూరలు, చట్నీలతో పాటు సలాడ్లలో దీనిని వాడతారు

నెయ్యి చాలా తేలికగా జీర్ణమయ్యే కొవ్వులలో ఒకటి. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. మీ రోజువారీ ఆహారంలో నెయ్యి కచ్చితంగా ఉండాలి.ఉసిరి లో   విటమిన్ సి  ఉంటుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. ఇది అన్ని వ్యాధులను దూరంగా ఉంచుతుంది. రోజూ ఉసిరికాయ లేదా ఉసిరి రసం తీసుకుంటే మంచిది.రాగులలో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

శీతాకాలంలో రాగి, బజ్రా, జొన్న వంటివి తినడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవి మీ జీర్ణవ్యవస్థకు మంచిది రక్త ప్రసరణను పెంచుతుంది.అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని నయం చేయడంలో సహాయపడతాయి. జెర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని టీలో చేర్చి ప్రతిరోజు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు.పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 1 టీస్పూన్ పసుపును తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. తేనె జీర్ణక్రియ, గట్ ఆరోగ్యానికి మంచిది. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఓమిక్రాన్‌తో పోరాడటానికి దీన్ని మీ అల్లం టీకి కలుపుకొని తాగవచ్చు.

 

Leave a Comment