మధ్యప్రదేశ్‌లో కోతికి అంత్యక్రియలు.. దైవస్వరూపంగా భావించి ప్రజలకు విందు..!

చనిపోయింది కోతి అయినా ఆ ప్రాంత ప్రజలు కోతే కదా అని వదిలేయలేదు. ఈ కాలములో తెలియని మనిషి చనిపోతేనే పట్టించుకొని జనాలు ఉన్నారు. అలాంటిది ఓక కోతి చనిపోతే దైవస్వరూపంగా భావించే ఆ ప్రాంత ప్రజలు అత్యంత వైభవంగా అంతిమ యాత్ర చేసారు. నగరంలోని ప్రజలందరూ ఆ యాత్రలో పాల్గొన్నారు. ఆ ఊరు కట్టుబాట్లు, సాంప్రదాయం  ప్రకారం నగర భోజ్ లో ఆహరం తీసుకున్నారు. ఈ వింత విషయము మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాలు ఈ కింది విధముగా ఉన్నాయి. 

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో కోతి చనిపోవడంతో, నగర విందు  అట్టహాసముగా జరిగింది.ఖిల్చిపూర్‌లోని దలుపురా గ్రామంలో సోమవారం జరిగిన ఈ వింత  పట్టణ విందుకు ఆ ఊరికి చుట్టు పక్కల 50 కిలోమీటర్ల వరకు గ్రామాల ప్రజలు  వచ్చారు. ఈ విందు లో దగ్గర దగ్గరగా 5 వేల మంది ఆహారం తిన్నారు. కోతి చనిపోవడంతో భాధ చెందిన ఆ  గ్రామస్థులు విరాళాలు అందించి ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసము కార్డులు కూడా ముద్రించారు. 

బ్యాండ్‌ భాజాతో అంత్యక్రియల ఊరేగింపు ద్వారా కోతి అంత్యక్రియలు జరిగాయి. కోతి చనిపోయియినా మూడవ రోజు ఉజ్జయినిలో చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు.ఆ గ్రామస్థుడు హరి సింగ్ కోతి కోసం గుండు చేయించుకుని కుటుంబ సభ్యుడిలా పదకొండవ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కోతులు ఆ దేవుని ప్రతిరూపము అని అందులోనూ  హనుమంతుని స్వరూపమని ఆ గ్రామస్తుల ఎక్కువగా నమ్ముతారు.

గత  ఎడాది 2021 డిసెంబర్ 29 రాత్రి కోతి మరణించింది.  ఆ రోజ ఉదయం అడవి వైపు నుంచి కోతి గ్రామంలోకి వచ్చింది. రోజంతా ఊరిలో  ఎగరుతు, దూకుతూ ఆ ఊరు మొత్తము తిరిగింది ఆ కోతి. ఆ రోజు  రాత్రి 8 గంటల సమయములో చలికి వణుకుతూ ఆ కోతి వచ్చి ఊరి లోని ఓక ఇంటి ముందు కూర్చుంది. ఇది గమనించిన జనాలు కోతి దగ్గర భోగి మంటలు వెలిగించారు.అలాగే గోరువెచ్చని దుస్తులు దానికి కప్పారు. కానీ కోతికి ఆరోగ్యం బాగుపడ లేదు. అందుకని ఆ ఊరి ప్రజలు కోతిని ఖిల్చీపూర్‌కు తీసుకెళ్లి వైద్యుడికి చూపించారు.

చికిత్స పూర్తి అయినా తరువాత ఆ గ్రామస్తులు తిరిగి కోతిని  గ్రామానికి తీసుకొని వెళ్లారు. ఆ ఊరిలోనే కోతి మధ్యాహ్నం 2 గంటల సమయములో  మృతి చెందింది.డిసెంబర్ 30వ తేదిన ఆ ఊరి జనము అంత హనుమాన్ ఆలయానికి వచ్చారు. కోతి అంతిమ యాత్రకు హాజరయ్యేందుకు మహిళలు కూడా ఆలయానికి వచ్చారు. ఈ అలయము లొ కోతికి అర్థం అలంకరించారు. తర్వాత కోతికి కొబ్బరికాయ పెట్టి నమస్కరించారు. దీని తర్వాత చివరి ప్రయాణం ముక్తిధామానికి అందరూ బయలుదేరరు. బ్యాండ్ ముందుకు సాగింది. ఆ  సమయంలో మహిళలు వెనుక నుంచి కీర్తనలు పాడుతూ ముక్తిధామానికి వెళ్లారు. చట్ట ప్రకారమే కోతిని దహనం చేశామని గ్రామానికి చెందిన బీరామ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

 

Leave a Comment