నెగిటివ్ ఆలోచనలను ఇలా తగ్గించుకోండి.. లేదంటే అనర్దాలే..

ప్రతి ఒక్కరికి నెగిటివ్ థాట్స్ రావడం సహజం.. కొంత మందికి అవి మరీ ఎక్కువగా వస్తుంటాయి. ప్రతి దానికి నెగిటివ్ గా ఆలోచిస్తూ నిత్యం ఒత్తిడికి గురవుతుంటారు. ఏ పని చేయాలన్నా వారిలో మొదటగా నెగిటివ్ ఆలోచనే వస్తుంది. ఈ నెగిటివ్ ఆలోచనలు వారిని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ నెగిటివ్ థింకింగ్ ని తీసేస్తేనే మీరు విజయం సాధిస్తారు. నెగిటిివ్ థింకింగ్ వల్ల మానసిక ఆరోగ్యం, శాారీరక ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. కాబట్టిి నెగిటిివ్ ఆలోచనలను తగ్గించుకోవాలి. 

నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఏంచేయాలి? how to overcome negative thoughts

  • నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీకు నచ్చిన పనులు చేయాలి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వాకింగ్‌కి వెళ్లడం చేయాలి. ఇలా చేయడం ద్వారాా నెగిటివ్ థింకింగ్ నుంచి మనసును మళ్లించుకోవచ్చు. అప్పటికీ ఆలోచనలు వస్తే ఎవరైనా మనసుకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడుకోవచ్చు.
  • సానుకూల ఆలోచనలను పెంచే పుస్తకాలు చదవాలి.  ప్రతిరోజు వాటిని చదవడం ద్వారా కూడా మీ ఆలోచనలను మార్చుకోవచ్చు. 
  • సానుకూలమైన మాటలు మాట్లాడే వారితో, నెగటివ్ మాటలకు దూరంగా ఉండే వారితోనే స్నేహం చేయండి.
  • ఒత్తిడి, అసంతృప్తితో జీవించే వాళ్లకు ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలే వస్తాయి. కనుక జీవితంలో మీరు సంతోషాన్ని చిన్నచిన్న విషయాల్లోనే వెతుక్కోవాలి. అలా అయితేనే ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి..
  •  ఏదైనా చెడు జరుగుతుందేమో అని ఒక నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు… మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. 
  •  మీకు నిరాశ కమ్మినప్పుడు మీ జీవితంలో జరిగిన మంచిని ఒకసారి గుర్తు చేసుకోండి. గత వైఫల్యాలను పునాదులుగా భావించండి. అంతేతప్ప వాటిని తలుచుకొని నిరాశ పడవద్దు. ఆలోచనలు 90% సానుకూలమైనవి అయితేనే మనం జీవితంలో సంతోషంగా జీవించగలం.

Leave a Comment