చర్మం నుంచి వీర్య కణాలు.. ఎలుకలపై ప్రయోగం విజయవంతం..!

ఈరోజుల్లో సంతానం లేక ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని వైద్యపరీక్షలు చేసినా సమస్య తీరకపోవడంతో కుంగిపోతున్నారు. పిల్లల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ సంతాన భాగ్యం కలగడం లేదు.. ముఖ్యంగా మగవారిలో వీర్య కణాల లోపం కారణంగా పిల్లలు పుట్టడం లేదు. అలాంటి వారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెబుతున్నారు. 

కృత్రిమ స్పెర్మ్ తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించారు. త్వరలోనే మనుషులపై కూడా ప్రయోగానికి సిద్ధమవుతున్నారు శాస్త్రవేత్తలు.. ఇందులో భాగంగా మగ ఎలుక చర్మం నుంచి కణాలు తీసకొని కృత్రిమంగా వీర్యకణాలను రూపొందించారు. వాటిని ఆడ ఎలుక గర్భాశయంలో ప్రవేశపెట్టగా.. మంచి ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. 

టోక్యో యూనివర్సిటీలో ఈ ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగంలో ఎలుక ఎంబ్రియోస్ నుంచి కణాలను తీసుకుంటారు. ఈ కణాలకు కెమికల్స్ కలిపి స్పెర్మ్ తయారు చేశారు. స్పెర్మ్ గా మారిన ఈ కణాలను మగ ఎలుక జననాంగాల్లోకి ప్రవేశపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఐవీఎఫ్ ద్వారా ఆడ ఎలుక శరీరంలో ఇంజెక్ట్ చేశారు. ఈ ప్రయోగంలో ఆడ ఎలుకకు చాలా పిల్లలు పుట్టారని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రయోగం మనుషులపై విజయవంతమైతే మాత్రం సైన్స్ రంగంలోనే అద్భుతమే కాకుండా.. మగవారికి చాలా ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.  

Leave a Comment