వేసవిలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేస్తే ప్రమాదమా?

ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువయ్యాయి. ఆ వార్తలు అసలు నిజమో.. కాదో అని నిర్ధారించుకోకుండానే చాలా మంది దానిని షేర్ చేస్తుంటారు. దీంతో అవి వైరల్ అవుతుంటాయి. అసలు ఆ వార్త ఫేక్  తెలియకుండా దానిని నమ్మేస్తుంటారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 

తాజాగా ఇలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. ఆ వార్తలో ఏముందంటే.. ‘ప్రస్తుతం ఎండలు ఎక్కువయ్యాయి. ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించకండి.. దీని వల్ల పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ వారంలో ఐదు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోజులో కనీసం ఒకసారి అయినా పెట్రోల్ ట్యాంక్ తెరవడం ద్వారా లోపల ఉండే గ్యాస్ బయటకు వస్తుంది.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి’. అని ఆ వార్తలో ఉంది.. 

ఈ వార్త నిజమేనా?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో వైరల్ అవుతున్న ఈ వార్తపై సదరు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తాము ఇలాంటి హెచ్చరికను జారీ చేయలేదని స్పష్టం చేసింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ వార్త షేక్ అని తేల్చి చెప్పింది. ఆటో మొబైల్ కంపెనీలు వాహనాలను తయారు చేసేటప్పుడు అన్ని పరిస్థితులను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటాయని, అందువల్ల ఎండాకాలంలో ట్యాంక్ ఫుల్ చేయిస్తే పేలుళ్లు సంభవిస్తాయనేది తప్పుడు ప్రచారం అని కొట్టి పారేసింది. ఆ వార్తను నమ్మవద్దని సూచించింది.. 

Leave a Comment