హిమాలయాల్లో దొరికే మొక్కతో కరోనా కట్టడి.. ఐఐటీ అధ్యయనంలో వెల్లడి..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ.. వివిధ వేరియంట్లలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి కట్టడికి పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక వైద్య పరంగా, ఆయుర్వేద పరంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కోవిడ్ కట్టడికి వ్యాక్సిన్ వేయడంతో పాటు, మానవ శరీరంపై వైరల్ దాడిని నిరోధించే నాన్-వ్యాక్సిన్ ఔషధాల కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పరిశోధకులు కరోనాకు చెక్ పెట్టే మొక్కను హిమాలయాల్లో గుర్తించారు. 

హిమాచల్ ప్రదేశ్ లోని ఐఐటీ మండి, ఐసీజీఈబీ శాస్త్రవేత్తలు హిమాలయాల్లో పెరిగే ‘రెడ్ డెండ్రాన్ అర్బోరియం’ అనే మొక్కలోని పూరేకుల్లో ఫైటో కెమికల్స్ ఉన్నాయని, వీటికి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా ‘బురాన్ష్’ అని అంటారు. ‘బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 

ఐఐటీ మండి శాస్త్రవేత్తలు, న్యూ ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు బురాన్ష్ మొక్కలోని రేకుల నుంచి ఫైటో కెమికల్స్ ను సేకరించి అధ్యయనం చేశారు. హిమాలయాల్లో దొరికే బురాన్ష్ మొక్కల రేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. ఈ రేకుల్లో వివిధ రకాత ఫైటో కెమిక్స్ ఉన్నట్లు శాస్త్రీయంగా పరీక్షించినట్లు ఐఐటీ మండి అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ తెలిపారు. మొక్కల నుంచి లభించే ఆయుర్వేద ఔషధాలు శరీరంలోని కణాల్లోకి ప్రవేేశించి వైరస్ ను అడ్డుకుంటాయని, వైరస్ ను అడ్డుకునే శక్తిని శరీరానికి కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ మొక్కలపై మరిన్ని పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

Leave a Comment