ఇలాంటి పెళ్లి ఎప్పుడూ చూసిండరు..వినుండరు.. స్వీయ వివాహం చేసుకోబోతున్న యువతి..!

ఇప్పటి వరకు ఎన్నో వివాహాలు చూసింటారు.. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, స్వలింగ వివాహం.. వంటి వివాహాల గురించి వినుంటారు. కానీ ఇలాంటి వివాహం గురించి ఎప్పుడూ వినుండరు.. అదే ‘స్వీయ వివాహం’.. తనను తానే పెళ్లి చేసుకోవడం.. త్వరలో ఈ పెళ్లి తంతును ముగింజేందుకు సర్వం సిద్ధం చేసుకుంది ఓ గుజరాతీ యువతి.. జూన్ 11న ఈ ‘సోలోగమీ’ చేసుకోబోతోంది..!

గుజరాత్ లోని వడోదరకు చెందిన క్షమ బిందు 24 ఏళ్ల అనే యువతి సోలోగమీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ వివాహానికి కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది ఈ యువతి. స్వీయ వివాహం అంటే నీ కోసం నీవు కట్టుబడి ఉండడం.. నీపై నీకు అవధుల్లేని స్వచ్ఛమైన ప్రేమ ఉండడం.. అని చెబుతోంది. 

ఇక ఈ పెళ్లిని సంప్రదాయబద్ధంగా జరుపుతున్నారు. బంధువులు, అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. నుదటిపై సింధూర లేపనం, ఏడడుగులు నడవడం అన్ని ఉంటాయి. అక్కడ లేనిది కేవలం వరుడు మాత్రమే.. అంతేకాదు పెళ్లి తర్వాత రెండు వారాల పాటు గోవాకు హనీమూన్ కి కూడా వెళ్లనున్నట్లు క్షమ బిందు తెలిపింది.

ఇక ఈ వివాహానికి తన కుటుంబం కూడా అంగీకరించిందని బిందు చెబుతోంది. సోలోగమీ గురించి ఇంటర్నెట్ లో వెతికానని, విదేశాల్లో కొన్ని చోట్ల కనిపించాయని, కానీ ఇండియాలో మాత్రం ఇదే మొదటిదని వివరించింది. ఈ పెళ్లి విషయంలో తనపై విమర్శలు రావచ్చని, అయితే అవేమీ తాను పట్టించుకోనని చెప్పింది. 

 

Leave a Comment