ఫోన్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య..!

ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో సెల్ పోన్ సాధారణమైపోయింది. పిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అయ్యారు. ఫోన్లలో గేమ్స్ ఆడేందుకు అలవాటు పడ్డారు. ఫోన్లు కొనివ్వాలని తల్లిదండ్రులకు ఒత్తిడి చేస్తున్నారు. కొనివ్వకపోతే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థి తల్లిదండ్రులు సెల్ పోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లాలో జరిగింది. 

జిల్లాలోని వాజేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన సాయి లిఖిత్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. స్నేహితుల చేతిలో ఫోన్లు ఉండటం చూసి తనకు ఓ మొబైల్ కావాలని ఇంట్లో గొడవ చేశాడు. తల్లి సుశీల కొడుకును మందలించడంతో సోమవారం అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కోపం తగ్గాక వస్తాడులే అని ఇంట్లో వాళ్లు అనుకున్నారు.

అయితే సాయంత్రమైనా సాయి లిఖిత్ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టారు. వెంకటాపురం మండల పరిధిలోని పాలెం వాగు ప్రాజెక్టులో బుధవారం ఉదయం సాయి లిఖిత్ శవమై కనిపించాడు. సాయి లిఖిత్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment