అమ్మాయి కోసం.. అబ్బాయిగా మారుతున్న అమ్మాయి..!

ఇంతవరకు ఒక అబ్బాయి.. అమ్మాయిగా మారడం చూశాం.. కానీ ఉత్తప్రదేశ్ లో మాత్రం ఒక అమ్మాయి.. అబ్బాయిగా మారడానికి సిద్ధపడింది. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోంది.. ఇంతకు వ్యవహారం ఏంటంటే..యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వారిని ఒప్పించేందుక ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.. 

దీంతో వీరిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు.. ఇద్దరిలో ఒక అమ్మాయి.. అబ్బాయిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరిలో ఒక అమ్మాయి లింగ మార్పిడి చేయించుకోవడానికి సిద్ధమైంది. దానికోసం ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి వైద్యులు ఆమెకు లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. యువతి శరీర పైభాగాలు, ఛాతీ పునర్నిర్మానానికి వీలుగా చికిత్స చేశారు. 

ఓ మహిళకు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ అమ్మాయి.. అబ్బాయిగా మారడానికి సుమారు ఏడాదిన్నర కాలం పడుతుందని చెప్పారు. లింగమార్పిడి తర్వాత ఆమె గర్భం దాల్చే పరిస్థితి ఉండదన్నారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని తెలిపారు.  

Leave a Comment