ఏపీలో జులై 5 నుంచి స్కూల్స్ ప్రారంభం.. అకడమిక్ క్యాలెండర్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్ లో జులై 5 నుంచి 2022-23 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ని విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం జులై 5 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. పాఠశాలలు 220 రోజులు పనిచేయనున్నాయి. 80 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.

అకడమిక్ క్యాలండర్:

  • 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి. 
  • ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉంటాయి. 
  • క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉంటాయి. 
  • సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఇస్తారు. 

పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ :

  • సెప్టెంబర్ లో ఫార్మేటివ్ అసెస్ మెంట్ -1 పరీక్షలు
  • అక్టోబర్ లో ఫార్మేటివ్-2
  • నవంబర్, డిసెంబర్ లో సమ్మేటివ్-1
  • వచ్చే ఏడాది జనవరిలో ఫార్మేటివ్-3
  • ఫిబ్రవరిలో ఫార్మేటివ్-4
  • ఫిబ్రవరి 22 నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
  • ఏప్రిల్ లో సమ్మేటివ్-2 పరీక్షలు 

పాఠశాలలు జులై 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అయితే టీచర్లు మాత్రం ఈనెల 28 నుంచి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. పాఠశాలల ప్రారంభం అయ్యే నాటికి తరగతి గదులు, ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని ఆదేశాలు ఇచ్చింది. పాత పుస్తకాలను సేకరించి బుక్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని తెలిపింది. 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో మీటింగ్ నిర్వహించాలని, జులై 5న విద్యా కానుకల కిట్లను పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.   

Leave a Comment