కరోనాతో ఫ్రెండ్ మృతి.. స్నేహితుడి భార్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇచ్చాడు..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంతో మంది భర్తలను, బిడ్డలను కోల్పోయి అనాథలయ్యారు. కుటుంబంలో పెద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా కరోనా కాటు ఓ భార్య తన భర్తను కోల్పోయింది. భర్త లేకుండా బతకలేనని ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త మృతితో చీకటిమయం అయిందని బాధపడుతున్న ఆమెను నేనున్నా అంటూ ఆదుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చాడు భర్త ప్రాణ మిత్రుడు.. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని చామరాజ్నగర్ జిల్లా ముల్లూర్ గ్రామానికి చెందిన చేతన్ కుమార్, లోకేష్ లో ప్రాణ మిత్రులు. చేతన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అతడికి గుల్బర్గా జిల్లా హనూర్ కి చెందిన అంబికతో 8 ఏళ్ల క్రితం పెళ్లయింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేతన్ మహమ్మారి బారిన పడి చనిపోయాడు. దీంతో భర్త మరణాన్ని జీర్ణించుకోలేని అంబిక ఆత్మహత్యాయత్నం చేసింది.. 

మిత్రుడు లోకేష్ కూడా చేతన్ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా మిత్రుడు చేతన్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు లోకేష్.. స్నేహితుడి భార్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడు. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. అటు అంబిక కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాడు. దీనికి వారు అంగీకరించారు. దీంతో జనవరి 27న చామరాజనగర్ లోని శివయోగి మఠంలో అంబిక మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నాడు. 

Leave a Comment