కూతుర్లకు ఆస్తి హ‌క్కు..సుప్రీం కోర్టు కొత్త తీర్పు..వారికే మొదటి అవకాశం..!

ప్రతీ దేశంలో ఒకరి ఆస్తి  మరొకరికి చెందే హక్కు ఉంటుంది. ఈ విధాముగానే మన భారతదేశంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆతని ఆస్తి అతని పిల్లలకు చెందుతుంది. హిందూ కుటుంబంలో ఆస్తి పంపకం రెండు విషయంలో ఉంటుంది. ఒకటేమో స్వార్జితం, మరి రెండోది పిత్రార్జితం. 2005 నాటి హిందు వారసత్వ చట్టం1956 సవరణ ప్రకారం తండ్రి వారసత్వ ఆస్తిలో కూతురికి కొడుకుతోపాటు సమాన హక్కు ఉంటుంది. కూతురికి పెళ్లైనా కూడా ఆమె హక్కు ఎక్కడికీ పోదు. ఆస్తిలో కేవలం కుమారులకే హక్కు ఉందని భావిస్తుంటారు. 

మహిళలకు ఆస్తి హక్కు చెందుతుందా అనే విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని కుమారులతో పాటు కుమార్తెకు సమాన ఆస్తి హక్కు ఉంటుందని చెప్పింది. మన దేశములో కుటుంబ సమ‌స్య‌లు, ఆస్తి వివాదాలు మీద కోర్టు కేసులు, వాటి తీర్పులు అత్యంత స‌హ‌జం అని అందరికి తీలిసిందే. ఈ నేపథ్యములో ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు తాజాగా మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కుపై కీల‌క‌మైన తీర్పు ఇచ్చింది. మ‌హిళ‌ల స‌మ‌నాత్వ‌పు హ‌క్కును కాపాడే దిశ‌గా ఈ తీర్పు ఉంది.  ఏ కుటుంబంలోనైన ఇంటి పెద్దఇంటికి, ఆస్తికి సంబంధించిన వీలునామా రాయకుండా చనిపోతే ఆ వ్య‌క్తి ఆస్తులపై కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు సరి కొత్తగా ఒక  తీర్పు ఇచ్చింది.

ఈ తాజా తీర్పుతో 1994వ సంవత్సరంలో దిగువ న్యాయస్థానం, మరియు 2009లో మద్రాసు హైకోర్టు ప్రకటించిన తీర్పుల్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు ఇప్ప‌టికే తీర్పు ఇచ్చింది. మద్రాసు కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్య‌తిరేకముగా అప్పటి  బాధితులు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై సుప్రీంకోర్టు విచార‌ణ మొదలుపెట్టింది.

చనిపోయిన వ్యక్తి పురుషుడు అయ్యితే ఆ వ్య‌క్తి యొక్క సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని కుమార్తెలకే  ఆస్తి  విషయములో  ఎక్కువ ప్రాముఖ్యము ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.నాన్న చనిపోయాక అతని ఆస్తులు ఆయన సోదరుడి కుమారుడికి చెందుతాయా లేదా అతని సొంత కుమార్తెకు వారసత్వ హక్కు అనే అంశాలపై ధర్మాసనం విచారణ జరిపి 51 పేజీల తీర్పు చెప్పింది.

ఈ తీర్పు సంద‌ర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్య‌లు చెప్పింది. ‘‘కుమార్తెలకు, వితంతువైన భార్యకు ఉన్న హక్కును హిందూ సంప్రదాయ చట్టాలు, వివిధ తీర్పులు స్ప ష్టంగా గుర్తించాయ‌ని తెలిపింది.ఒక హిందూ మహిళ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం ఆమెకు తన తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు ఆమె తండ్రి వారసులకు చెందుతాయి. ఆమెకు భర్త ద్వారా, లేదా మామగారి ద్వారా లభించిన ఆస్తులు భర్త వారసులకు దక్కు తాయి’’ అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది.

 

Leave a Comment