చికిత్స లేకుండానే రొమ్ము క్యాన్సర్ నివారణ..!

రోజు రోజుకి రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువ అవుతున్నారు. దీనిని తగ్గించడములో నిపుణులు సలహాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా అక్టోబర్ నెలని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించారు. దాని యొక్క ముఖ్య లక్ష్యం రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన అందరిలో కల్పించడం. మన దేశంలో, ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లో ఈ వ్యాధి ఎక్కువ ఉంది.మన జీవిన విధానము రోజు రోజుకి మారిపోతుంది.ఇంకా వయసు ఎక్కువ అవుతున్న సమయములో కూడా చాలా మందికి అనారోగ్యం సమస్యలు వస్తున్నాయి.

చాలా ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ఒక్కటి. ఇప్పుడున్న వైద్య రంగంలో అనేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి చికిత్స లేకుండా రొమ్ముక్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చని హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజిస్టు, హెమటో ఆంకాలజిస్టు డాక్టర్‌ నిఖిల్‌ చెప్పారు.ఇప్పుడున్న కాలంలో ఇలాంటి వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని, ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది.అలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా చికిత్స అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చుంటున్నారు.

రొమ్ము క్యాన్సర్‌కి అతి పెద్ద శత్రువు మద్యం.ఈ మధ్య కాలములో మహిళలు కూడా మద్యం ఎక్కువ తాగుతున్నారు.ఇలా మద్యము సేవించడము వల్ల చాలా మంది మహిళల్లో అనేక క్యాన్సర్ల వస్తన్నాయి.ఇందులో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన చాలా మంది పడుతున్నారు.ఆడవారు మద్యంకి దూరముగా ఉండాలి అని నిపుణులు అంటున్నారు.

రొమ్ము క్యాన్సర్‌కు ఎక్కువ బరువు ఉండటము కూడా ఓక కారణం. ఊబకాయం అనేది చాలా మందిలో ఒక పెద్ద సమస్యగా ఉంది. లావుగా ఉండటము వల్ల అనేక సమస్యలు వస్తాయి.అందులో రొమ్ము క్యాన్సర్ కూడా ఒక్కటి, దీనికి బరువు తగ్గడము కూడా ఒక మంచి ఉయోగము. రొమ్ము క్యాన్సర్ విషయములో జాగ్రత్తగా ఉండాలి మరియు నిపుణుల చెప్పిన సలహాలు, సూచనలు పాటించడం చాలా మంచిది.

ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ప్రతిరోజు వ్యాయమం చెయ్యడము ఒక చక్కటి ఉపయోగం. ఇలా చెయ్యడము వల్ల అనారోగ్యం కూడా తక్కువ అవుతుంది అని డాక్టర్స్ కూడా చెపుతున్నారు. ఇలా ప్రతి రోజు వ్యాయమం చేస్తే రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ.

రొమ్ము క్యాన్సర్ ను తగ్గించడంలో తల్లి పాలు చాలా ముఖ్యమైనది. తల్లి తన పిల్లలకు ఎంత ఎక్కువ కాలం చనుబాలిస్తే, అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెపుతున్నారు. మంచి ఆహారము తీసుకోవడం వల్ల అనేక సమస్యలు దరి చేరవు అని నిపుణులు అంటున్నారు. పోషకాహారాల వల్ల కూడా వివిధ రకాల క్యాన్సర్లతో పాటు మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, ఇతర వ్యాధుల నుంచి ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. పండ్లు, మంచి ప్రొటీన్స్‌ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

 

Leave a Comment