పది రూపాయలకే నాణ్యమైన వైద్యం.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం వైద్యం ఖరీదైపోయింది. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు పోవడానికే ఇష్టపడటం లేదు. ఎందుకంటే అక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండవని. కార్పొరేట్ కు వెళ్లాలంటే ప్రజలకు భయం.. ఎందుకంటే చిన్న జబ్బుకు అక్కడ వేల రూపాయాల ఖర్చు అవుతుంది కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో తక్కువ ఫీజుతోనే వైద్యం అందిస్తోంది ఓ డాక్టర్.. కడప నగరంలో కేవలం రూ.10 ఫీజు తీసుకుంటూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు యువ వైద్యురాలు నూరి పర్వీన్..

కడప జిల్లాలో నూరి పర్వీన్ అంటే తెలియకపోవచ్చు. కానీ పది రూపాయల డాక్టర్ అంటే చిన్ని పిల్లలు కూడా ఇట్టే చేప్పేస్తారు. కడపలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ నూరీ ఆ నగరంలోనే ఓ క్లినిక్ నడుపుతున్నారు.  కడప పాత బస్టాండ్ సమీపంలోని ఓ బస్తీలో పర్వీన్ క్లినిక్ ఉంది. 

డాక్టర్ నూరీ పర్వీన్ తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు. ఆమె తాత, నాన్న కూడా సమాజ సేవ చేస్తూండేవారు. తాత, తండ్రి బాటలోనే పర్వీన్ కూడా వెళ్లలనుకుంది. అయితే విజయవాడలో పనిచేస్తు తాత, తండ్రి పేరుపైనే గుర్తింపు వస్తుందని, కానీ కడపలో తనేంటో నిరూపించుకునే అవకాశం కలిగిందని నూరి పర్వీన్ చెబుతున్నారు. కడప ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడటంతో వదిలి వెళ్లలేకపోతున్నానని అంటున్నారు. 

తన చదువు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే మిగిలిపోకుండా పది మందికి ఉపయోగపడాలని భావించింది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే పేదవాడు భయపడుతున్న వేళ.. అలా తను ఉండకుండా ఎవరైనా తన ఆస్పత్రికి ఆనందంగా రావాలని ఆశించింది. అందుకే కేవలం రూ.10 ఓపీ ఫీజుతో కడపలోనే ఆస్ప్రతిని ప్రారంభించింది. భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి, అక్కడ కూడా పది రూపాయలకే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనుకుంటున్నారు ఆ యువ డాక్టర్ పర్వీన్.. భవిష్యత్తులో మానసిక నిపుణులు కావాలని ఉందని పర్వీన్ తెలుపుతున్నారు. 

అంతే కాదు కరోనా కాలంలో ప్రజలను చూసేందుకు కార్పొరేట్ ఆస్పత్రులే నిరాకరించాయి. ఆ సమయంలోనూ పర్వీన్ వైద్య సేవలను కొనసాగించింది. సామాజిక సేవతోనూ ఎంతో మందిని ఆదుకుంది. కరోనా సమయంలో ప్రజల్లో అపోహలు పెరగకుండా వారిని అప్రమత్తం చేయడమే కాకుండా అనేక మంది ఆరోగ్యం కుదుటపడేటా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 

 

Leave a Comment