ఎస్పీ బాలుకు పద్మవిభూషన్ పురస్కారం..!

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. కాగా గాన గంధర్వుడు, దివంగత సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో కేంద్రప్రభుత్వం గౌరవించింది. సినీ గాయని చిత్ర పద్మ భూషన్ పొందారు. 

ఈ ఏడాది నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు లభించాయి. వారిలో ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరు ఉన్నారు. ఏపీ నుంచి ఆర్ట్స్ విభాగంలో రామస్వామి అన్న వరపు, నిడుమోలు సుమతి.. సాహిత్యం, విద్యలో ప్రకాశ రావు అశావాది.. తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనక రాజులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా కేంద్రం ఈ ఏడాది పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతో పాటు డాక్టర్ బెల్లె మొనప్ప హెగ్డే(కర్ణాటక), నరేందర్ సింగ్ కపవే(కర్ణాటక), మౌలానా వహిదుద్దీన్ ఖాన్(ఢిల్లీ), సుదర్శన్ సాహూ(ఒడిశా) లకు పద్మవిభూషన్ అవార్డులు దక్కాయి. ఇక మరణాంతరం అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరున్ గొగోయ్, మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ లు పద్మభూషణ్ పొందారు.   

Leave a Comment