కంగనా రనౌత్ పద్మశ్రీకి అర్హురాలేనా..?

ఇటీవల భారత ప్రభుత్వం 2020. 2021కి సంబంధించిన పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ పద్మ అవార్డులు అందుకున్న వారిలో ఒకవైపు నిజమైన అర్హులు తులసి గౌడ, హరికెల హజబ్బ ఉన్నారు. మరో వైపు కంగనా రనౌత్, ఏక్తాకపూర్, కరణ్ జోహార్ లాంటి వారు ఉన్నారు. అవార్డులకు వీరి ఎంపికపై ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా కంగనా రనౌత్ కి అవార్డు ప్రకటించడం పట్ల దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెలో ఏం అర్హత ఉందని అవార్డు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.. 

అసలు పద్మ అవార్డులకు అర్హులు ఎవరూ?

పద్మ అవార్డులు అనేవి భారతరత్న అవార్డుల మాదిరిగానే సివిలియన్ అవార్డు.. పద్మ అవార్డులు దేశంలో వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి, సమాజంలో తమదైన ముద్ర వేసిన వారికి, పేదలకు సేవలు చేస్తున్న వారికి, ఉచిత సర్వీసులు అందిస్తున్న వారికి, కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్న వారికి, ఇలా రకరకాల సామాన్యులు, ప్రముఖులకు ఈ వార్డులు ప్రకటిస్తారు. ముందుగా పద్మ అవార్డులకు నామినేట్ అయిన వారిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. వారు నిజమైన అర్హులా కాదా అనేది ప్రభుత్వం యొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ధ్రువీకరిస్తుంది. నామినేట్ అయిన వారికి ఎలాంటి వివాదాలు ఉండకూడదు.. 

ఈ సంవత్సరం ఎక్కువ వివాదానికి గురైన అవార్డు గ్రహీత ఎవరంటే ఆమెనే కంగనా రనౌత్.. కంగనా రనౌత్ కి పద్మశ్రీ ప్రకటించడం పట్ల దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంగనా మెట్రో, గ్యాంగ్ స్టర్ సినిమాల ద్వారా పరిచయమైంది. ఫ్యాషన్ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత 4 సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. కానీ నాలుగైదు సినిమాలు మినహా.. కంగనా చేసినవన్నీ ఫ్లాప్ సినిమాలే.. కేవలం నాలుగైదు సినిమాల కోసం కంగనాకు పద్మ అవార్డు ఇవ్వాలా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. 

రెండో విషయం ఏంటంటే.. పద్మ అవార్డు ఇవ్వాలంటే నామినేట్ అయిన వారి క్యారెక్టర్ చూస్తారు.. కానీ కంగనా రనౌత్ కెరీర్ మొత్తం వివాదాలే.. కంగనా రనౌత్ చాలా సందర్భాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు చేసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది. దీని వల్ల కంగనాను ట్విట్టర్ బ్యాన్ కూడా చేసింది. అంతే కాదు క్యాస్టిజమ్ ను కూడా ప్రమోట్ చేసింది. భారతదేశం యొక్క ఓ పట్టణాన్ని ‘పీఓకే’తో పోల్చింది.. 

కొంత కాలంగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న కంగనా రనౌత్ ఏకంగా దేశ స్వాతంత్య్రం గురించే కారుకూతలు కూశారు. 1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు భిక్ష అని, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మన దేశ స్వాతంత్య్రాన్నే అవమానించారు. దీన్ని పిచ్చి అనాలా, వెర్రి అనాలా, పైత్యం అనాలో అర్థం కావట్లేదు. కంగనా బీజేపీ సానుభూతి పరురాలు అనేది బహిరంగ రహస్యం.. ప్రధాని మోడీకి భక్తురాలు అని కూడా అందరికీ తెలుసు.. మోడీ భజన చేస్తే చేసుకోవచ్చు కానీ.. అందుకోసం జాతి నేతలను, దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్నే అవమానిస్తారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు బాలీవుడ్ బిగ్ షాట్స్, పెద్ద వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది కంగనా..

అలా అయితే పాపులారిటీ రావట్లేదని అనుకుందేమో.. ఇప్పుడు ఏకంగా దేశ స్వాతంత్య్రాన్నే బద్నాం చేసే దుస్సాహసం చేసింది. అసలు ఈ స్థాయిలో మోడీ భజన ఎందుకు చేస్తోంది.. జాతీయ అవార్డులు, పద్మ అవార్డుల కోసమేనా అంటే.. అవుననే వాదన వినిపిస్తోంది. అయితే జాతీయ అవార్డులు అనేవి ఆమె నటనను చూసి ఇస్తారు. కానీ పద్మ అవార్డు అనేది కేవలం నటన మాత్రమే కాదు..  క్యారెక్టర్ ని కూడా చూసి ఇస్తారు.. అందుకే కంగనాకు పద్మశ్రీ ఇవ్వడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం బీజేపీ సానుభూతి పరురాలు కావడంతోనే ఈ అవార్డు ఇచ్చారా..? ఇలాంటి వారికి అవార్డు ఇవ్వడం వల్ల.. అవార్డు కీర్తిని అవమానించడమే కదా.. ఇన్ని వివాదాలు ఉన్న కంగనాకు అవార్డు ఇవ్వడం కరెక్టేనా మీ కామెంట్ల రూపంలో చెప్పండి..

Leave a Comment