విద్యార్థుల చదువుల కోసం సొంత నగలు అమ్మేసిన టీచర్..!

మన సంస్కృతిలో గురువుకు చాలా గొప్ప స్థానం ఉంది. మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు.. తల్లిదండ్రుల తర్వాత అంతటి వారుగా గురువును కీర్తించారు. ఎందుకంటే భావి భారత పౌరులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేది గురువులే.. కొంత మంది గురువులు విద్యార్థలు చదువు కోసం దేనికైనా సిద్ధపడతారు.. తమిళనాడు పాఠశాలకు చెందిన ఒక టీచర్ విద్యార్థులను ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి తన ఆభరణాలను కూడా అమ్మేసింది.. ఉపాధ్యాయ వృత్తికి వన్నే తెచ్చిన ఈ టీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులోని విల్లుపురం పట్టణానికి చెందిన అన్నపూర్ణ మోహన్ కందాడులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 3వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించేవారు..అయితే అన్నపూర్ణ తర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో బోధించాలని, కార్పొరేట్ స్కూళ్లలో లాగా ఇంగ్లీష్ మాట్లాడించాలని భావించింది. అందుకు తగ్గ సౌకర్యాలు ఆ పాఠశాలలో లేవు.

అందుకోసం పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న వీడియోలను తన ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ చేసింది. దీంతో వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశంలోనే కాకుండా కెనడా, సింగపూర్ వంటి దేశాల నుంచి పిల్లలకు ఆర్థిక సాయం అందించారు. ఆమె కూడా తన నగలు అమ్మి పిల్లలు చదువుకోవడానికి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. తన విద్యార్థులు చదువుకునే తరగతి గదిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దింది. పాఠశాలలో అధునాతన డిజిటల్ సిస్టమ్, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు అవసరమయ్యే డిజిటల్ పరికరాలు, ఇంగ్లీష్ పుస్తకాలు, సౌకర్యవంతమైన ఫర్నిచర్ సమకూర్చింది..

‘ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు ప్రైవేట్ పాఠశాలల కంటే అంతగా బాగుండవు.. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తారు.. మనం కూడా కొంచెం ప్రయత్నం చేస్తే.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను కట్టలేని కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించగలము’.. అని అన్నపూర్ణ అంటున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లీషులో మాట్లాడాలనేది తన కల అని ఆమె పేర్కొన్నారు. మరీ తమ సొంత ప్రయోజనాలు కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడే అన్నపూర్ణ మోహన్ వంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు ఎంత మంది ఉంటారు మీరే చెప్పండి…     

   

Leave a Comment