ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా.. అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు..!

కొంత మందికి ఏసీలో ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉంటుంది.. ఇంట్లో, ఆఫీసుల్లో, కార్లలో ఏసీ.. ఇలా రోజులో ఎక్కువ సమయం ఏసీలోనే గడిపేస్తుంటారు. వేసవి కాలం అయిపోయినా కూడా.. ఏసీలో ఉండటమే అలావాటు ఉంటుంది. ఇలాంటి వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే 24 గంటలపాటు ఏసీలో ఉండేవారి చర్మం త్వరగా ముసలిదైపోతుందట.. 

ఏసీలో ఉండే వారి చర్మంలో కలిగే మార్పులు:

  • చర్మం త్వరగా ముడతులు పడి తేమను కోల్పోతుంది. అంతేకాదు చర్మం కుచించుకుపోయి, గీలు పడతాయి. 
  • చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉండాలంటే సహజంగా నూనెలు ఉత్పత్తి అవ్వాలి.. ఏసీ నుంచి వచ్చే కూల్ ఎయిర్ చెమట ఉత్పత్తిని, నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. చర్మంలో టాక్సిన్స్ పెరిగేలా చేస్తుంది. దీని వల్ల చర్మం నిస్తేజంగా అనారోగ్యంగా మారుతుంది. 
  • చర్మంలో తేమ తగ్గి పోడిగా మారుతుంది. దీంతో చర్మంలో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల ముసలితనం త్వరగా వచ్చినట్లు అవుతుంది. 
  • ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తామర, సొరియాసిస్, రొసేసియా వంటి సమస్యలు వస్తాయి. 

మరీ ఏం చేయాలి?

  • ఏసీలో ఎక్కువ సమయం ఉండే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీలో ఫిల్టర్లు త్వరగా ధూళి కణాలతో నిండిపోతాయి. ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఏసీ ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయడం లేదా మారుస్తూ ఉండాలి.  
  • ఏసీలో ఉంటే ఎక్కువగా దాహం వేయదు.. అలా అని నీరు తాగకుండా ఉండకూడదు. గంటకు ఒకసారైనా నీరు తాగుతూ ఉండాలి. దీని వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. 
  • ఏసీలో ఉండటం వల్ల చర్మంలో నూనెలు ఇంకిపోతాయి. కాబట్టి చర్మానికి తేలికపాటి మాయిశ్చరైజర్ ను రాయాలి. 
  • రోజులో కొన్ని గంటలు బయటి వాతావరణంలో కూడా తిరగాలి. 

 

 

Leave a Comment