బీర్ తాగడం హెల్త్ కి మంచిదే.. పోర్చుగీస్ యూనివర్సిటీ రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు..!

బీర్ తాగడం ఆరోగ్యానికి హానీకరం.. ఇది వైద్య నిపుణులు చెప్పే మాట.. కానీ..బీర్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు పోర్చుగీస్ కి చెందిన నోవా యూనివర్సిటీ రీసెర్చ్ లో తేలింది.. ప్రతిరోజూ కొద్ది మొత్తంలో బీర్ తాగడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని వెల్లడైంది. 35 సంవత్సరాలు గల 19 మందిపై నోవా యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధన జరిపారు. 

వారికి ప్రతిరోజూ 325 మి.లీ. బీర్ ని నాలుగు వారాల పాటు అందించారు. వీరిలో కొందరికి నాన్ ఆల్కహాలిక్, మరి కొందరికి 5.2 శాతం ఆల్కాహాలిక్ బీర్ ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత వారి రక్త నమూనాలు, మల వ్యర్థాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ పరిశోధన వివరాలను అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమెస్ట్రీ అనే జర్నల్ లో ప్రచురించారు.   

బీర్ తాగడం వల్ల మనిషి పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. ఇందులో వైవిధ్యమైన బాక్టీరియా ఉందని.. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని వెల్లడైంది. అంతేకాదు,రోజూ బీర్ తాగడం శరీర బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపదని తేలింది. అలాగే గుండె, రక్తం, జీవక్రియలపై దుష్ప్రభావం ఉండదని తేలింది.

బీర్‌లో పాలిఫినాల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా మనిషి పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుతుందని తెలిపారు. మానవ శరీరంలో వైవిధ్యమైన బాక్టీరియా ఉండటం మంచిదేనని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.

 

 

 

 

Leave a Comment