ఆమె వయసు 54.. మేకప్ తో 30 అని నమ్మించి పెళ్లి చేసుకుంది..!

ఈరోజుల్లో ఎంత అందవిహీనంగా ఉన్నా సరే.. మేకప్ తో అందంగా మార్చేస్తారు.. ముసలి వాళ్లను కూడా యవ్వనంగా చూపిస్తారు.. అలా ఓ మహిళ మేకప్ తో యువతిలా మారి పెళ్లి చేసుకుంది.. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

వివరాల మేరకు తిరుళ్లూరు జిల్లా పుదుప్పేటకు చెందిన ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. అతడికి అప్పటికే పెళ్లయి విడాకులు అయ్యాయి. అతడికి రెండో పెళ్లి కోసం సంబంధాలు చూస్తోంది.. ఈక్రమంలో ఓ బ్రోకర్ ద్వారా తిరపతి జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య పరిచయమైంది..  

శరణ్యకు 54 ఏళ్లు ఉన్నాయి.. ఆమెను చూసుకోవడానికి ఇంద్రాణి, ఆమె కొడుకు వస్తున్నారన్న సమాచారంతో.. వెంటనే బ్యాటీపార్లర్ కి వెళ్లి మేకప్ వేయించుకుని 30 ఏళ్ల యువతిలా తయారైంది. ఆ యువకుడికి శరణ్య నచ్చడంతో తిరువళ్లూరులో భారీగా ఖర్చు చేసి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో పెళ్లికూతురుకు 25 సవర్ల బంగారం ఇచ్చారు.. 

పెళ్లయిన కొద్దిరోజుల శరణ్య భర్తకు, అత్తకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. భర్త సంపాదన అంతా తన చేతిలోనే పెట్టాలని, ఆస్తులను తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేసింది. ఈక్రమంలో అత్తను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. దీంతో అనుమానం వచ్చిన భర్త విచారణ చేశాడు.. 

ఆస్తిని రాసి ఇస్తాను.. నీ ఆధార్ కార్డు ఇవ్వాలని శరణ్యను అడిగాడు. దీంతో వెంటనే తన ఆధార్ కార్డును భర్తకు ఇచ్చింది. అంతే.. ఆధార్ కార్డులో ఆమె బండారం బయటపడింది. విచారణలో శరణ్య వయసు 54 అని, పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తేలింది.    

 

Leave a Comment