ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. జీవితం నరకమే..!

పెళ్లి అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో జీవితాంతం ఉండేటట్లు చేసే బంధం.. మరీ జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తి మిస్ పర్ఫెక్ట్ లేదా మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలాంటి వ్యక్తులు దొరకడం కష్టం.. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ లను చేసుకోకపోయినా ఫర్వాలేదు. కానీ ఈ ఆరు లక్షణాలు ఉన్న వారిని మాత్రం ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదని సైకాలిజిస్టులు చెబుతున్నారు. కాలక్రమేణా వారితో జీవితం కష్టతరమవుతుందని అంటున్నారు. 

1.ప్రామిస్ బ్రేకర్

మాట మీద నిలబడని వారిని పెళ్లి చేసుకోకండి.. ఒకటి రెండు సార్లు అయితే క్షమించవచ్చు. కానీ తరుచూ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని వారికి మాట విలువ తెలియదు. ఇలాంటి వారి వల్ల రోజూ ఇంట్లో ఏదో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. 

2.నియంత లక్షణాలు

రెండోది నియంత లక్షణాలు అంటే.. వీరు చెప్పినట్లు నడుచుకోవాలి. వీరు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు. అంటే ఇవే తినాలి.. ఈ డ్రెస్ వేసుకోవాలి.. ఇలాగే నడువు.. ఇక్కడ నిల్చో.. ఇలా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని కంట్రోల్ చేసేవారు.. ఇలాంటి వారు మంచి జీవిత భాగస్వామి కాలేడు. భార్య లేదా భర్తను ప్రేమించడం కంటే తన అదుపులో ఉంచుకోవడానికే వీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. 

3.ప్రాధాన్యత లేని వ్యక్తి

వివాహం చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు మనుషుల మధ్య ఇవ్వడం, తీసుకోవడం, పంచుకోవడం అన్ని సమానంగా ఉండాలి. తీసుకోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేని వ్యక్తితో ఇబ్బందులు ఎదురవుతాయి. వారు అవతలి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 

4.పదే పదే క్షమాపణలు చెప్పడం

తప్పు చేయడం.. అదే తప్పును పునరావృతం చేయడం, క్షమాపణలు చెప్పి తప్పించుకోవడం.. ఈ అలవాటు ఉన్న వ్యక్తులు కూడా మంచి జీవిత భాగస్వామి కాలేరు. వారికి క్షమాపణ విలువ తెలియదు.

5.అంహకారం ఉన్న వ్యక్తులు

అహంకారం అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ అది హద్దులు దాటితే మాత్రం ఆ బంధం నిలవదు. నేను, నాది. నేను చెప్పేదే వినాలి, నువ్వు నాకు చెప్పేదేంటీ అని అహంకారం చూపే వ్యక్తికి దూరంగా ఉండడం బెటర్.. 

6.అబద్ధాలు చెప్పే వారు

మీ జీవితంలోకి ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఆహ్వానించకండి. ప్రతి విషయంలో అబద్ధం చెప్పే వారితో జీవితాంతం నమ్మకంగా ఎంతవరకు ఉండగలరో ఆలోచించుకోండి.. 

 

 

 

Leave a Comment