కివీస్ స్పిన్నర్ సంచలనం..ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన భారత్ సంతతికి చెందిన బౌలర్..!

కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ముంబై లోని వాంఖడే స్టేడియంలో టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో అజాజ్ పటేల్ 10 వికెట్లు సాధించాడు. దీంతో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన మూడో బలౌర్ గా అజాజ్ నిలిచాడు.

ఇంగ్లండ్ బౌలర్  జిమ్ లేకర్, భారత స్పినర్ అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వల్ 150 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాగా అజాజ్ పటేల్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.. పైగా ముంబాయిలోనే అజాజ్ పటేల్ జన్మించడం ప్రత్యేకం.. 

 

 

Leave a Comment