ట్రాన్స్ జెండర్లతో మెగా కోడలు ఉపాసన.. ఫొటోలు వైరల్..!

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిట్ నెస్ తో పాటు తన వ్యక్తిగత విషయాలు, రామ్ చరణ్ సినిమా విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అపోలో ఆస్పత్రులు, ఫార్మసీలు విజయవంతంగా రన్ అవ్వడంలో కీలక భూమిక పోషిస్తారు. 

తాజాగా ఉపాసన ట్రాన్స్ జెండర్లను ప్రోత్సహిస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటోంది. సమాజంలో స్వలింగ సంపర్కులు, నపుంసకులు తదితర LGBT గురించి అసభ్యంగా ఆలోచిస్తుంటారు.. కానీ మెగా కోడలు ఉపాసన మాత్రం వారితో స్నేహంగా ఉండి.. ఇంటి వేడుకలో భాగం చేసింది. ఒక ట్రాన్స్ జెండర్ తో అన్యోన్యంగా ఉన్న ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్ జెండర్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఉపాసన.. తన సోదరి అనుష్ పాలా పెళ్లి వేడుకల్లో భాగంగా ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ సభ్యులను ఇంటికి ఆహ్వానించి వారితో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో ఉపాసన ఇలా రాసుకొచ్చారు. ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది మానవత్వమని, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సరైన అవకాశమని పేర్కొన్నారు. అనుష్ పాల్ పెళ్లి వేడుకలను ఆప్యాయంగా ప్రారంభించినందుకు లక్ష్మీనారాయణ త్రిపాఠికి ధన్యవాదాలు తెలిపారు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలనేది వీరు ఎల్లప్పుడూ తనకు నేర్పాతారని తెలిపింది. హైదరాబాద్ లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమాజాన్ని తాను ఎప్పుడు గౌరవిస్తానని ఉపాసన చెప్పుకొచ్చారు. 

Leave a Comment