ఆ హోటల్ లో ఎంత మర్యాద ఇస్తే అంత డిస్కౌంట్..!

హోటళ్లలో చాలా మంది అక్కడి వెయిటర్లతో మరద్యా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మన దగ్గర వచ్చిన వెయిటర్ తో ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా ఏకవచనంతో పిలవడం, మాట్లాడటం చేస్తుంటారు. హోటళ్లలో పని చేసే వారంటనే చిన్నచూపు చూస్తుంటారు. చాలా మంది కస్టమర్లు వారితో అమర్యాదగా ప్రవర్తిస్తారు. 

అందుకోసం హైదరాబాద్ ఖాజాగూడలోని దక్షిణ్-5 రెస్టారెంట్ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. రెస్టారెంట్ లో మర్యాదను బట్టి డిస్కౌంట్ ఇస్తుంది. హోటల్ మెనూ కార్డు ప్రకారం వెజ్ థాలీ ధర రూ.160 ఉందనుకోండి.. మన టేబుల్ దగ్గరకు వచ్చిన వెయిటర్ తో మర్యాద లేకుండా.. ‘ఏక్ వెజ్ థాలీ’ అని దర్పంగా ఆర్డర్ చేస్తే మాత్రం డిస్కౌంట్ ఉండదు.. 

అలాకాకుండా ‘ఒక వెజ్ థాలీ ప్లీజ్’ అని ఆర్డర్ ఇస్తే మాత్రం బిల్లులో రూ.15 డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా కొంచెం ఆత్మీయంగా ‘గుడ్ ఆఫ్టర్ నూన్.. ఒక వెజ్ థాలీ ప్లీజ్’ అని ఆర్డర్ ఇస్తే బిల్లు రూ.30 డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు ఈ హోటల్ లో సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక రాయితీ ఇస్తారు. తెలంగాణ సహా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో రెస్టారెంట్ నడుపుతున్నట్లు రెస్టారెంట్ వ్యవస్థాపకులు సోలంకి, సంజయ్ కపూర్ తెలిపారు. ఈ హోటల్ లో తినాలంటే.. డబ్బులతో పాటు కొంచెం రెస్పెక్ట్ కూడా ఉండాలన్నమాట.   

 

Leave a Comment