చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ..వర్షాలు ఎప్పటి నుంచి అంటే..!

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈక్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని ప్రకటించింది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వెల్లడించింది. 

ఇక రానున్న వర్షాకాలంలో వర్షపాతం కూడా సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది 96 నుంచి 104 శాతం మేర వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. నైతురుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఈశాన్య, వాయువ్య, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.  

 

Leave a Comment