గోదావరి అల్లుడికి మర్యాద.. 365 వంటకాలతో విందు భోజనం..!

గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు మారుపేరు..అందులో సంక్రాంతి పండుగ  వచ్చిందంటే చాలు అతిథి మర్యాద విషయంలో అస్సలు తగ్గరు. ఇక ఇంటి అల్లుళ్లకు గోదావరి జిల్లాల్లో ఇచ్చే మర్యాదే సపరేటు.. రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. మర్యాద విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. తాజాగా నరసాపురంలో మనవరాలికి, ఆమెకు కాబోయే భర్తకు తాతయ్య ఇచ్చిన విందు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతుల కూతురు అత్యం మాధవికి, తణుకుకు చెందిన తుమ్మలపల్లి సాయి క్రిష్ణతో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వధువు తాత నూతన వధూవరులకు విందు ఏర్పాటు చేశారు. విందులో భాగంగా ఏకంగా 365 రకాల వంటకాలతో అతిథ్యమిచ్చారు. అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలతో పాటు 30 రకాల కూరలు, వివిధ రకాల పిండి వంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల డ్రింక్స్, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులతో విందు ఏర్పాటు చేశారు.  

Leave a Comment