దెయ్యాలు ఉన్నాయి.. వాటిని మంత్రాలతో తరిమేశా : ఐఐటీ ప్రొఫెసర్

ఎవరైనా దెయ్యాలు ఉన్నాయంటే.. మనం వాటికి కొట్టిపారేస్తాం.. ఈ ఆధునిక యుగంలో కూడా దెయ్యాలేంటీ అని లైట్ తీసుకుంటాం.. కానీ ఓ ఐఐటీ ప్రొఫెసర్ మాత్రం నిజంగా దెయ్యాలు ఉన్నాయని అంటున్నారు.  ఐఐటీ మండికి కొత్తగా నియమితులైన డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహరా దెయ్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేేశారు. 

దెయ్యాలు ఉన్నాయని, వాటిని మంత్రాలు, శ్లోకాలతో తరిమికొట్టానని ప్రొఫెసర్ చెబుతున్నారు. ఈ సందర్భంగా 1993 నాటి సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పారు. అప్పుడు తాను తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని పఠించడంతో పాటు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. 

దెయ్యాలు తన స్నేహితుడి భార్యను, అతడి తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించడం కూడా చూశానని చెప్పాడు. ప్రొఫెసర్ లక్ష్మీధర్ దెయ్యాల గురించి చెబుతున్న ఒక వీడియో యూట్యూబ్ లో ‘లెర్న్ గీత లైవ్ గీత’ పేరుతో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఆసక్తికరమైన వీడియోగా వైరల్ అవుతోంది. లక్ష్మీధర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్.. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. జర్మన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పోస్ట్ డాక్టరేట్ చేశారు. ఆయనకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రత్యేక నైపుణ్యం ఉంది. 

 

Leave a Comment