Inspiration Story: పదో తరగతి కూడా చదవని భార్యను.. ఐపీఎస్ చేసిన కానిస్టేబుల్ భర్త..!

సంకల్పం ఉండే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారు ఈ ఐపీఎస్ అధికారి. చదువుకు పెళ్లి, పిల్లలు ఏవీ అడ్డుకావని నిరరూపించారు. 14 ఏళ్లకే 10వ తరగతి పూర్తికాకుండానే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కానీ భర్త సహకారంతో చదువు పూర్తి చేసి ఐసీఎస్ అధికారిగా నిలిచారు. ఈ ఇన్ స్పైరింగ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 

వివరాల మేరకు.. అంబికకు 14 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఓ కానిస్టేబుల్ తో పెళ్లి జరిపించారు. 18 సంవత్సరాలు వచ్చే సరికి అంబిక ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఓ రోజు అంబికా తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూసేందుకు వెళ్లారు. అక్కడ ఇద్దరు పోలీస్ అధికారులకు గౌరవించడం చూశారు. అలాంటి గౌరవం తనకూ కావాలని భర్తతో చెప్పారు. 

అయితే అంబిక పది కూడా చదవలేదు. దీంతో అది సులువు కాదని, ఐపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత కావాలని భార్యకు నచ్చ చెప్పేందుకు చూశాడు భర్త. కానీ అంబిక మాత్రం ఎంతకష్టమైనా ఐపీఎస్ సాధిస్తానని పట్టబట్టారు. ఆమె పట్టదలను అర్థం చేసుకున్న భర్త ఆమెను ఓ ప్రైవేట్ కోచింగ్ ఇప్పించారు. అలా 10వ తరగతి పూర్తి చేసిన అంబిక తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా సివిల్స్ కి సిద్ధం కావాలని అనుకున్నారు.

అయితే వారు నివసిస్తున్న దిండిగల్ లో సివిల్ కోచింగ్ సెంటర్ లేదు. దీంతో ఆమెను చెన్నైకి పంపించారు. పిల్లలను తాను చూసుకుంటానని, నువ్వు కష్టపడి చదవాలని భార్యకు చెప్పాడు.. చెన్నైలో కోచింగ్ తీసుకున్న అంబిక సివిల్స్ లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో అంబికను ఇంటికి వచ్చేయాలని కోరాడు భర్త. కానీ అంబిక మాత్రం పట్టు వదల్లేదు. చివరిసారిగా ప్రయత్నిస్తానని భర్తను ఒప్పించారు. ఆ తర్వాత కష్టపడి చదివి ప్రిలిమ్స్, మెయిన్స్, సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి 2008లో ఐపీఎస్ కి ఎంపికయ్యారు..  

ఆ తర్వాత హైదరాబాద్ పోలీస్ అకాడమిలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం అంబిక ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తెగువ, దూకుడతనంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందరూ ఆమెను ‘ముంబాయి సివంగి’ అని ‘లేడీ సింగం’ అని పిలుస్తుంటారు. విధి నిర్వహణ, సేవాతత్పరతకు ఆమెకు తగిన గుర్తింపు లభించింది. అంబిక ‘లోక్ మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్-2019’ అవార్డు అందుకున్నారు. 

Leave a Comment