ఇసుకలో కూర్చొని భోజనం.. హైదరాబాద్ లో ఎడాారి ఇసుక థీమ్ తో సరికొత్త మండీ..!

హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది బిర్యానీ.. దేశవ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీకి అంత హైప్ ఉంది.. అంతే కాదు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భోజనం దొరుకుతుంది. దేశ, విదేశాల వంటకాలు హైదరాబాద్ లో లభిస్తాయి. విభిన్నమైన థీమ్‌లతో విభిన్న రుచులతో భోజనప్రియులను సంతృప్తిపరిచే హోటళ్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. సరికొత్త తరహాలో మరిన్ని హోటళ్లు వస్తున్నాయి. 

తాజాగా హైదరాబాద్‌ ప్రజలకు మరో కొత్త థీమ్‌తో ఓ హోటల్‌ వచ్చింది. హైదరాబాద్ నగరానికి ఎడారి లుక్ అందించారు. ఇసుక తిన్నెలపై కూర్చొని సరికొత్త అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ హోటల్‌కు వెళ్తే ఎడారి ప్రాంతంలో భోజనం చేసినట్టే ఉంటుంది. కొత్తదనం కోరుకునే వారికి ఈ హోటల్‌ ఓ బెస్ట్ ఆప్షన్. మరి ఈ హోటల్‌ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం.

ఎక్కడ ఉంది?

హైదరాబాద్‌లోని నాగోలులో థారు ఎడారి మండీ (థారూ డిసర్ట్‌ మండీ) అనే హోటల్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంత ఇతివృత్తంతో ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. అంటే ఎడారి ప్రాంతంలో ఉండే మాదిరి మొత్తం ఇసుక వేశారు. ఇసుకపై భోజనం చేయాల్సి ఉంటుంది. ఇసుకపై సౌదీలో వినియోగించే పెద్దటి తివాచీలు పరిచారు. వాటిపై బల్లలు ఏర్పరచి మండీ పద్ధతిలో భోజనం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎడారి ప్రాంతంలో వేసుకునే టెంట్లు (బెడౌయిన్‌ టెంట్లు) కూడా ఏర్పాటుచేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తమ హోటల్‌కు వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభవం పొందేలా ఈ విధంగా తీర్చిదిద్దినట్లు హోటల్‌ యజమాన్యం చెబుతోంది. చెన్నై నుంచి ప్రత్యేకంగా ఇసుకను తీసుకొచ్చి ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇసుకలో కూర్చోవడం కాకుండా సాధారణంగా కూర్చునే అందుబాటులో కూడా ఉన్నాయి.

ఎలా ఎళ్లాలి..

హైదరాబాద్‌లోని నాగోల్‌. నాగోల్‌ నుంచి బండ్లగూడ వెళ్లే మార్గంలో ఉంటుంది. ఫ్లైఓవర్‌ కింద పెట్రోల్‌ బంక్‌ పక్క గల్లీలో నుంచి వెళ్తే వస్తుంది. 

Leave a Comment