రూ.29కే నాణ్యమైన బియ్యం..ఎక్కడ తీసుకోవాలంటే..!

దేశంలో బియ్యం ధరలు మండిపోతున్నాయి. పేద, మధ్యతరగతిి ప్రజలు నాణ్యమైన బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త అందించింది.  ప్రజలకు అతి తక్కువ ధరకు బియ్యం అందించేలా సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. ‘భారత్‌ రైస్‌’ పేరిట రూ.29కే బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

దేశంలో మనకు కావలసిన నిల్వల కంటే కూడా అధిక మోతాదులో బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కానీ మార్కెట్ పరిస్థితులకు లోబడి బియ్యం ధరలు పెరిగిన కారణంగా సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ అవుట్ లెట్లలో భారత్ రైస్ పేరుతో 29 రూపాయలకే బియ్యం అందించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘భారత్ దాల్’, ‘భారత్ వీట్’ పేర్లతో పప్పు, గోధుమ పిండి అందిస్తున్న విషయం తెలిసిందే. సామాన్య, పేద మధ్యతరగతి ప్రజలకు గోధుమ పిండి రూ.27.50, పప్పును రూ.60కి కిలో చొప్పున అందిస్తోంది.

ఎక్కడ తీసుకోవాంటే..

భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌), భారత సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీపీఎఫ్‌), కేంద్రీయ భండార్‌కు సంబంధించిన కేంద్రాలలో భారత్‌ బియ్యం అందుబాటులో ఉంటాయి. భారత్‌ రైస్‌ 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచనుంది. భారత్‌ రైస్‌ కోసం కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 5 లక్షల టన్ను బియ్యాన్ని కేటాయించింది.

Leave a Comment