కంటి చూపు లేకపోయినా.. 7,500 కి.మీ. సైకిల్ యాత్ర..!

ముంబాయికి చెందిన అజయ్ లాల్వానీ(25) పుట్టుకతోనే అంధుడు.. కంటి చూపు లేకపోయినా దేశవ్యాప్తంగా ఏకంగా 7,500 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్రను ప్రారంభించాడు. అతడి ప్రయాణం ముంబాయి నుంచి ప్రారంభమై శ్రీనగర్, కన్యాకుమారి తిరిగి ముంబాయి ఇళా సాగనుంది. 45 రోజుల వ్యవధిలో 12 రాష్ట్రాలలో సైక్లింగ్ చేయనున్నాడు. అతనితో పాటు మరో 18 మంది సభ్యులు, రెండు వాహనాలు ఉంటాయి. వాకీటాకీల ద్వారా అజయ్ కి సూచనలు ఇస్తారు. 

అజయ్ గతంలోనూ ముంబై-గోవా-ముంబై మరియు దాదర్-గోండియా-దాదర్ సైకిల్ యాత్ర చేసి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అతడు జూడో మరియు కబడ్డీలో జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్ టెర్నమెంట్లలో అనేక పతకాలను కూడా గెలుచుకున్నాడు. 

మన దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని, అందుకే సైకిల్ యాత్ర చేసి రోడ్డు భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు అజయ్ లాల్వానీ తెలిపారు. ఈ మిషన్ లో లైటింగ్ లో గ్లోబల్ లీడర్ అయిన సిగ్నిఫై తనకు మద్దతు ఇస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. 45 రోజుల్లో సైకిల్ యాత్రను ముగించి తన కలను నేరవేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.  

Leave a Comment