బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. ఎందుకో తెలుసా?

ఎవరైనా ప్రముఖులు చనిపోతే వారి అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొనడం చూస్తుంటాం..అదే ఒక బిచ్చగాడు మరణిస్తే మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అత్యక్రియలు నిర్వహిస్తారు. అసలు వారి గురించి పెద్దగా చర్చించుకోరు కూడా.. కానీ ఈ బిచ్చగాడి అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు.. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లా హువినహడగలిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హవినహడగలి పట్టణంలో హుచ్చబస్య(45) అనే మానసిక దివ్యాంగుడు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నాడు. పట్టణంలోని ఆలయాలు, పాఠశాలల్లో తలదాచుకునేవాడు. హుచ్చబస్య పట్టణంలో తనకు ఎదురొచ్చిన వారిని ఒక్క రూపాయి అడిగేవాడు. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా తీసుకునేవాడు కాదు. ఆయనకు రూపాయి దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్మేవారు. ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడుకాదు.. పట్టణంలో హుచ్చబస్య గురించి తెలియనివారు ఉండరు.. స్థానిక ఎమ్మెల్యేలు కనిపించినా వారిని పేరుపెట్టి పిలిచి ఒక్కరూపాయి అడిగేవాడు..  

అయితే హుచ్చబస్య శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఇది తెలిసి హవినహడగలి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. హుచ్చబస్య అంతిమయాత్రను ఘనంగా చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు. వందలాది మంది అంతిమయాత్రలో పాల్గొని హుచ్చబస్యకు తుది వీడ్కోలు పలికారు. 

 

Leave a Comment