ఆడవారికి ఆ కష్టాలు తీరినట్టే.. త్వరలోనే మగవారికి గర్భనిరోధక మాత్రలు..!

ఇది ఆడవాళ్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గర్భనిరోధక మాత్రలు కేవలం ఆడవాళ్లు మాత్రమే వేసుకుంటున్నారు. ఆడవాళ్లకు మాత్రమే ఆ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఆడవారిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వీరి కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఎందుకంటే మగవారికి కూడా గర్భనిరోధక మాత్రలు రాబోెతున్నాయి. ఈ మాత్రలను భర్త వేసుకుంటే చాలా.. భార్య వేసుకోవాల్సిన పనిలేదు.. 

అయతే ఈ గర్భనిరోధక మాత్రలు ప్రస్తుతం ట్రయల్స్ దశలోనే ఉన్నాయి.ఈ మాత్రలు మగ ఎలుకల్లో 99 శాతం సక్సెస్ ఇచ్చాయి. త్వరలోనే మనుషులపై ట్రయల్స్ చేయనున్నారు. ఈ హ్యూమన్ ట్రయల్స్ ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రయోగం అమెరికాలోని మిన్సోసోటా యూనివర్సిటీలో జరుగుతోంది. వచ్చే సంవత్సరం జరిగే అమెరికన్ కెమికల్ సొసైటీ మీటీంగ్ లో ఈ ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేస్తున్నారు. 

ఈ గర్భనిరోధక మాత్ర ఒక నాన్ హర్మోనల్ డ్రగ్. ఇది హార్మోన్లపై ఎటువంటి ప్రభావం చూపించదు. రెటినోయిక్ యాసిడ్ రిసెప్టర్(RAR) ఆల్పా అనే ప్రొటీన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. రెటినోయిక్ అనేది మగవారిలో వీర్యం ఏర్పడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెటినోయిక్ ఆమ్లం, రెటినోయిక్ యాసిడ్ రిసెప్టర్ ఆల్ఫాతో కలుస్తుంది. 

 RAR ఆల్పాను నిర్వీర్యం చేస్తే గర్భం దాల్చడం కష్టం అవుతుంది. పరిశోధకులు ఈ RAR ఆల్పాను నిర్వీర్యం చేసే సమ్మేళనాన్ని తయారు చేశారు. దీనికి YCT529 అనే పేరు కూడా పెట్టారు. ఈ సమ్మేళనం వీర్య కణాలను తగ్గిస్తుంది. దీంతో కలయిక సమయంలో గర్బధారణను 99 శాతం నిరోధిస్తుంది.. త్వరలోనే ఈ మాత్రలు అందుబాటులోకి రానున్నాయి..   

Leave a Comment