హవ్వా.. బస్సులోనే బీర్ తాగిన విద్యార్థినులు.. వీడియో వైరల్..!

స్కూల్ కి వెళ్లి చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు బరితెగించారు. కదులుతున్న బస్సులోనే విద్యార్థునులు మద్యం సేవించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లాలో జరిగింది.. 

చెంగల్ పట్టు జిల్లాలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినులు యూనిఫామ్ ధరించి కదులుతున్న బస్సులో బీర్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ కనిపించారు. అమ్మాయిలు బీర్ తాగుతుండగా.. అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మాయిలు బీర్ తాగుతుండగా.. అబ్బాయిలు గట్టిగా అరుస్తున్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బస్సులోని విద్యార్థులంతా చెంగల్ పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా తెలిసింది. విద్యార్థులు తిరుకజుకుండ్రం నుంచి తాచూర్ కు బస్సులో వెళ్తున్నారు. ముందుగా ఈ ఘటన పాతదనుకున్నారు. కానీ మంగళవారం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 

విద్యార్థినులు బస్సులో బీర్ తాగుతున్న వీడియో అధికారుల  దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఇది పాఠశాల బయట జరిగింది కాబట్టి పోలీసులు దీని గురించి విచారణ జరుపుతున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Leave a Comment