ఇంజినీర్ ఉద్యోగం వదిలేసి.. టీ కొట్టు పెట్టుకున్న బ్రదర్స్..!

ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో చేరారు. కానీ వారికొచ్చే అరకొర జీతంతో వారు సంతృప్తి చెందలేకపోయారు. అందుకే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావించారు.. అందుకే ఉద్యోగాలు వదిలి సొంతంగా టీకొట్టు పెట్టుకున్నారు. జీతం డబ్బుల కంటే టీ అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు..‘ఇంజినీర్ చాయ్ వాలా’ పేరుతో ఫేమస్ అయ్యారు పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ చెందిన అన్నదమ్ములు..

దుర్గాపూర్ కి చెందిన సుమన్ కర్ అనే యువకుడు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశాడు. తర్వాత ఓ కార్ షోరూమ్ లో ఉద్యోగంలో చేరాడు. అయితే అక్కడ తనకొచ్చె అకరొర జీతం అతనికి సరిపోయేది కాదు. దీంతో సొంతంగా ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేయాలని భావించాడు. కానీ వ్యాపారం చేసేందుకు సరిపడా డబ్బులు తన వద్ద లేదు. 

అప్పుడే అతనికి టీ స్టాల్ ఓపెన్ చేయాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే ‘ఇంజినీర్ చాయ్ వాలా’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించాడు. మొదట్లో ఒకటి రెండు లీటర్ల టీ అమ్మిన సుమన్.. ఇప్పుడు 40 లీటర్ల టీ విక్రయిస్తున్నాడు. అతని వద్ద ఒక్కో టీ ధర రూ.10 నుంచి రూ.30 వరకు ఉంటుంది. 

టీ వ్యాపారం బాగా నడుస్తుండటంతో సుమన్ తమ్ముడు సుమిత్ కర్ కూడా తన ఇంజనీరింగ్ కెరీర్ ని వదిలేసి అన్నయ్య వ్యాపారంలోకి దిగాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన సుమిత్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.. కానీ ఇప్పుడు అన్నయ్య వద్దే ఫుల్ టైం పార్టనర్ గా చేరిపోయాడు. 

ఇతర టీ స్టాల్స్ కంటే ఇక్కడి టీ రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. అందుకే తమ టీ వ్యాపారాన్ని రాబోయే రోజుల్లో మరింత విస్తరించాలని వారు అనుకుంటున్నారు. అరకొర జీతానికి గొడ్డు చాకిరీ చేయడంం కంటే సొంత వ్యాపారంచేసుకోవడం మేలని ఈ సోదరులు నిరూపించారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్..     

 

Leave a Comment