భార్య కోసం మరో తాజ్ మహాల్ కట్టిన ఈతరం షాజహాన్..!

తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడం.. ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహాల్ ను మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు. ఇది ఒకప్పటి విషయం.. ఇప్పుడు కొత్తి శతాబ్దాల తర్వాత మరో వ్యక్తి తన భార్య కోసం మధ్యప్రదేశ్ లో మరో తాజ్ మహాల్ కట్టించాడు. మూడేళ్ల పాటు శ్రమించి కట్టించిన ఈ కొత్త తాజ్ మహాల్ ను తన భార్యకు కానుక ఇచ్చాడు.. 

మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పుర్ కి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు ఆనంద్ ప్రకాష్ చౌక్సే తన భార్య మంజూషాపై ప్రేమతో తాజ్ మహాల్ లాంటి ఇంటిని కట్టించాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్స్ తో పాటు వంట గది, లైబ్రరీ, ధ్యానం చేసేందుకు ప్రత్యేక గది నిర్మించారు. ఇది కట్టేందుకు మూడేళ్లు పట్టినట్లు ఆనంద్ తెలిపారు. ఇది పర్యాటక కేంద్రంగా మారాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. 

ఈ ఇంటిని పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాలు పట్టినట్లు దీనిని నిర్మించిన కన్సల్టెంట్ ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే తెలిపారు. తాజ్ మహాల్ లాంటి రూపు కోసం తాము ఆగ్రాను సందర్శించామని, కొన్ని సాంకేతిక కొలతలు, ఫొటో గ్రాఫ్ లతో దీన్ని రూపొందించామని చెప్పారు. తాము ఇంటర్నెట్ నుంచి 3డీ విజువల్స్ ను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఇంకో విషయం ఏంటంటే షాజహాన్ సతీమణి ముంతాజ్ మహాల్ బుర్హాన్ పూర్ లోనే కన్నుమూసింది. తర్వాత ఆమె పార్థీవదేహాన్ని ఆగ్రాకు తరలించారు. 

 

 

Leave a Comment