పసఫిక్ మహాసముద్రంలో ‘బ్లాక్ హోల్’.. దీని మిస్టరీ ఏంటీ?

గత కొద్ద రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పసిఫిక్ మహాసముద్రంలో బ్లాక్ హోల్..దీంతో అదేమై ఉంటుందని ఊహిస్తూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. గూగుల్ మ్యాప్స్ చూస్తున్న సమయంలో ఒక సోషల్ మీడియా యూజర్ పసఫిక్ మహా సముద్రం మధ్యలో ఒక విచిత్రమైన బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించాడు. అప్పటి నుంచి దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతం అని కొందరు, కాదు..కాదు.. అది రహస్య దీవి అని.. మిలిటరీ స్థావరం అని చాలా మంది భావించారు. 

చివరికి ఆ పసఫిక్ మహాసముద్రంలో ఉన్న బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది. దానిని జనసంచారం లేని వస్టాక్ దీవిగా గుర్తించారు. ఇది పసఫిక్ మహా సముద్రం మధ్యలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి దేశ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కుగా 4000 మైళ్ల దూరంలో ఉన్న పగడపు దీవిగా గుర్తించారు. ఈ దీవిలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ దీవిలో చెట్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ.. ఆకాశం నుంచి చూసినప్పుడు అవి నల్లగా కనిపిస్తాయి. దీంతో గూగుల్ మ్యాప్స్ లో అవి బ్లాక్ హోల్స్ లాగా కనిపించాయి.  

Leave a Comment