వాటే క్రియేటివిటి.. ఆ విద్యార్థి ఆన్సర్ షీట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

స్కూళ్లలో రకరకాల విద్యార్థులు ఉంటారు. వారికి పరీక్షలు జరిగితే కష్టపడి చదివి రాసే వారు ఉంటారు. మరి కొందరు కాపీ కొట్టే వారు ఉంటారు. మరి కొందరు క్రియేటివ్ గా రాసే వారు ఉంటారు. కానీ ఇక్కడ ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. ప్రస్తుతం ఆ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ విద్యార్థి ఆన్సర్ షీట్ చూస్తే చాలా ఫన్నీగా, క్రియేటివ్ గా జవాబులు ఇచ్చాడు. మరో విశేషం ఏంటంటే.. ఆ విద్యార్థి ఆన్సర్ షీట్ కరెక్షన్ చేసిన టీచర్ కూడా జవాబు పత్రం చూసి ఎంజాయ్ చేసినట్లు ఉన్నాడు. సబ్జెక్ట్ పరంగా ఆ విద్యార్థిని ఫెయిల్ చేసినా.. క్రియేటివిటీలో మాత్రం అతడికి ఏ+ గ్రేడ్ ఇచ్చారు.. ఇంతకీ పరీక్ష పేపర్ లో ఆ విద్యార్థి ఏం జవాబులు ఇచ్చాడంటే..

ప్రశ్న: నెపోలియన్ ఏ యూద్ధంలో చినిపోయాడు? 

జవాబు: అతని చివరి యుద్ధంలో 

ప్రశ్న: స్వాతంత్య్ర ప్రకటనపై ఎక్కడ సంతకం చేశారు?

జవాడు: పేజీ చివరిలో

ప్రశ్న: రావి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?

జవాబు: నది ఉన్న రాష్ట్రంలో

ప్రశ్న: విడాకులకు ప్రధాన కారణం ఏంటీ?

జవాబు: పెళ్లి

ప్రస్తుతం ఈ ఆన్సర్ షీట్ వైరల్ అవుతోంది. దీంతో చూసిన ప్రతి ఒక్కరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. జీనియస్ స్టూడెంట్, వాటే క్రియేటివిటీ  అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆన్సర్ షీట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్..   

Leave a Comment