గుడిలో పూజారి.. చేసింది పాడు పని..!

తెలంగాణలోని నల్గొండలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్ చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఐదుగురిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యభిచార కూపంలో పట్టుబడ్డ ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను సఖి కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న ఓ మహిళ విటురాలుగా ఉందని చెప్పారు. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. వ్యభిచారం నిర్వహిస్తున్న రమేష్ చారి గుడిలో పూజారి.. తప్పిర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఛీ.ఛీ. గుడిలో పూజారిగా ఉంటూ ఈ పాడు పనిచేయడం ఏంటని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.    

 

 

Leave a Comment