Oh my God!.. అతడు తినే ఆహారం గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే..!

మీరు ఎక్కువ ఆహారం తినాలని పందెం వేయాలనుకుంటే.. బిహార్ లోని కతిహార్ కు వెళ్లాల్సిందే.. అతడి పేరే రఫీక్ అద్నాన్.. అతడు ప్రజాప్రతినిధి కాదు.. ప్రభుత్వ ఉద్యోగి కాదు.. అయితే అతడి బరువు, ఆహారపు అలవాట్ల ద్వారా చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజందరికీ తెలుసు..బుల్లెట్ బండిపై తిరుగుతుంటాడు.. ఆ ప్రాంతంలో అతడిని బుల్లెట్ వాలా జిజా అని పిలుస్తుంటారు.

రఫీక్ అద్నాన్ బరువు 200 కిలోలకు పైగా ఉంటుంది. అతడు తీసుకునే ఆహారం కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. కతిహార్ లోని జైనగర్ లో నివాసం ఉండే రఫీక్ అద్నాన్ ఫుడ్ మెనూ చూస్తూ అమ్మో అనాల్సిందే. అంత ఆసక్తికరంగా ఉంటుంది.. 

రఫీక్ అద్నాన్ ఫుడ్ మెనూ..

30 ఏళ్ల వయసున్న రఫీక్ ప్రతి రోజూ నాలుగు కేజీల పిండితో చేసిన రోటీలు, 3 కిలోల రైస్, రెండు కిలోల చికెన్, కిలోన్నర చేపలు, 3 లీటర్ల పాలు లాగించేస్తాడు. రఫీక్ అద్నాన్ కి ఇద్దరు భార్యలు.. రఫీక్ కడుపు నింపేందుకు ఒక భార్య అంత వంట చేయలేకపోయేది.. అందుకే రఫీక్ మరో పెళ్లి చేసుకున్నాడు. అంత వంట చేసినా.. తన భార్యలిద్దరూ కడుపు నిండా తినేంతగా ఆహారం ఇంట్లో మిగలడం లేదట.. 

రఫీక్ ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న రఫీక్ కి ఒక్క సంతానం కూడా లేదు. అద్నాన్ స్థూలకాయం వల్ల అతడిని ఎవరూ పెళ్లిళ్లకు పిలవరు. విందుకు వస్తే భారీగా భోజనం తినేస్తాడన్న ఆందోళనే అందుకు కారణం అని తెలిసింది. అద్నాన్ బులీమియా నెర్వోసా అనే వ్యాధితో బాధపడుతున్నాడని, అలాంటి వ్యక్తులు భారీ పరిమాణంలో తింటుంటారని వైద్యులు తెలిపారు. 

 

  

  

Leave a Comment